12.75 వరకు పన్ను ఎలా పడదంటే?- అధిక ఆదాయదారులకు కూడా..
12.75 వరకు పన్ను ఎలా పడదంటే?
అధిక ఆదాయదారులకు కూడా..
కొత్త పన్ను విధానంలో కేంద్రం మరోసారి మార్పులు చేపట్టింది. దీంతో రూ.12 లక్షల వరకు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.
వేతనజీవులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala sitharaman) గుడ్స్యూస్ చెప్పారు. కొత్త పన్ను విధానంలో రూ.12 లక్షల వరకు ఎలాంటి పన్నూ చెల్లించక్కర్లేదని వెల్లడించారు. ప్రామాణిక తగ్గింపుతో (స్టాండర్డ్ డిడక్షన్) కలుపుకొంటే రూ.12.75 లక్షల వరకు ఒక్క రూపాయి కూడా పన్ను చెల్లించనవసరం లేదని చెప్పారు. కొత్త పన్ను విధానంలో శ్లాబులు సైతం సవరించారు. అయితే, రూ.12 లక్షల వరకు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదంటూనే రూ.4 లక్షల-రూ.8 లక్షల వరకు ఆదాయం పై 5 శాతం పన్ను వర్తిస్తుందని చెబుతుండడంతో పలువురు అయోమయానికి లోనవుతున్నారు. ఇది తెలియాలంటే పన్ను లెక్కింపు విధానం గురించి తెలియాలి.
కొత్త పన్ను విధానంలో పన్ను చెల్లింపుదారులకు ఎలాంటి మినహాయింపులూ ఉండవు. ఒక ఏడాదిలో వచ్చే స్థూల ఆదాయంపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఒక ఉద్యోగి వేతనం.
ఏడాదికి రూ.12.75 లక్షలు అనుకుంటే అందులో ప్రామాణిక తగ్గింపు రూ.75 వేలు తొలగిస్తారు. ఇప్పుడు రూ.12 లక్షలను పన్ను ఆదాయంగా (ఇంతకుముందు రూ.7.75 లక్షలు) పరిగణిస్తారు. ఈ పరిమితి వరకు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 87ఏ కింద రిబేట్ మినహాయిస్తారు. అంటే మాఫీ చేసినట్లే. ప్రస్తుతం రూ.25 వేలుగా ఉన్న మొత్తాన్ని తాజా బడ్జెట్లో రూ.60 వేలకు పెంచారు. అంటే రూ.12.75 లక్షల వరకు ఎలాంటి పన్నూ చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే స ఆదాయం రూ.12.75 లక్షలకు ఒక్క రూపాయి దాటినా రిబేటు వర్తించదు. కాబట్టి పన్ను చెల్లించాల్సి వస్తుంది.
ఆదాయపు పన్ను లెక్కింపును మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి మరో ఉదాహరణ చూద్దాం. అనే వ్యక్తి ఆదాయం రూ.15 లక్షలు అనుకుందాం.
ఆదాయపు పన్ను లెక్కింపును మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి మరో ఉదాహరణ చూద్దాం. A అనే వ్యక్తి ఆదాయం రూ.15 లక్షలు అనుకుందాం. అందులో రూ.75వేలు ప్రామాణిక తగ్గింపును మినహాయిస్తే రూ.14 లక్షల 25 వేలు పన్ను చెల్లించాల్సిన ఆదాయం అవుతుంది. దీనిపై శ్లాబుల ప్రకారం పన్ను వర్తింపజేస్తే దాదాపు రూ.97,500 పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అంటే రూ.0-4 ల సున్నా: రూ.4- 8 లక్షలు 5 శాతం (రూ.20 వేలు); రూ.8-12 లక్షలు 10 (.40 వేలు); రూ.12- 15 లక్షలకు - 15 శాతం (దాదాపు రూ. 40వేలు) చెల్లించాల్సి ఉంటుంది.
శ్లాబుల మార్పుల వల్ల ఎవరికెంత లాభం?
ఇంటర్నేట్ డెస్క: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా ລໍ (Financial Minister of India) మధ్యతరగతి, వేతన జీవులకు శుభవార్త చెప్పారు. కొత్త పన్ను విధానం (New Tax Regime) లో రూ.12 లక్షల ఆదాయం వరకు ఎటువంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం లేకుండా రిబేట్ ప్రకటించారు. దీంతోపాటు ఆ విధానంలో శ్లాబ్‌లను కూడా మార్చారు. దీనికి మరో రూ.75 వేలు స్టాండర్డ్ డిడక్షన్ కలిపితే రూ.12,75,000 వరకు పన్ను ఉండదు.
కొత్త పన్ను విధానంలో మార్చిన శ్లాబ్‌లు..
• రూ. 0-4 లక్షలు - సున్నా
•రూ-8 - 5%
•రూ.8-12 5 - 10%
•రూ 12-16 - 15%
•రూ.16-20 - 20%
•రూ.20-24 రూ.- 25%
•రూ.24 లక్షల పైన 30 శాతం
అధిక ఆదాయదారులకు కూడా..
• కొత్త పన్ను ప్రకటనతో (Income 2025) రూ .5.12 ఆదాయం వరకు ఉన్నవారికి అత్యధికంగా రూ.80,000 వరకు మిగిలే అవకాశం ఉంది.
• గతంలో కొత్త పన్ను విధానం ప్రకారం రూ.15 లక్షల ఆదాయం దాటితే వారు ఏకంగా 30 శాతం పన్ను చెల్లించాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు 5. 16-20 , .20-24 ໘, 5.24 లక్షలు ఆ పైన కొత్త శ్లాబ్‌లను తీసుకొచ్చారు. దీంతో రూ.24 లక్షల ఆదాయం దాటితేనే 36 శాతం పన్ను (Income Tax) పడుతుంది. దీంతో గతంలో రూ.15-24 లక్షల మధ్య బ్రాకెట్లో ఉన్నవారికి లబ్ధి చేకూరనుంది.