కృష్ణానగర్ లో ప్రమాదకరంగా కరెంట్ తీగలు
కృష్ణానగర్ లో ప్రమాదకరంగా కరెంట్ తీగలు
సికింద్రాబాద్, ఫిబ్రవరి 01 ( ప్రజామంటలు):
బన్సీలాల్ పేట డివిజన్ న్యూ భోలక్ పూర్ కృష్ణానగర్ కాలనీ లో ప్రమాదకరమైన కరెంట్ పోల్ ను తొలగించిన అధికారులు, తిరిగి అదే స్థానంలో కొత్త కరెంట్ పోల్ ను ఏర్పాటు చేయాలని స్థానిక బీజేపీ నాయకులు కోరారు. మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి ఆదేశాల మేరకు స్థానిక బీజేపీ నాయకులు శనివారం ట్రాన్స్ కో ఏడీఈ ఆదినారాయణ ను కలసి సమస్య తీవ్రతను వివరించారు. తొలగించిన పోల్ ప్రదేశంలో కొత్త పోల్ ఏర్పాటు చేయకపోవడంతో కరెంట్ తీగలు ప్రమాదకరంగా వేలాడుతున్నాయని వారు ఏడీఈ దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన ఏడీఈ కొత్త పోల్ ఏర్పాటు గురించి ఉన్నతాధికారులకు లేఖ రాస్తామని, వేలాడుతున్న కరెంట్ తీగలను వెంటనే సరిచేయిస్తామని హామినిచ్చారు. కార్యక్రమంలో బీజేపీ ప్రెసిడెంట్ రామంచ మహేశ్, జిల్లా బీజేపీ కౌన్సిల్ సభ్యులు గుంటి సత్యనారాయణ, నాయకులు కిరీటా, కిరన్ కుమార్, సాయిరామ్, కుమార్, వికాస్, శ్రవన్, పిట్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.