విలేఖరి ముసుగులో జిల్లా పరిశ్రమ ల అధికారికి బెదిరింపులు. - ఇద్దరి అరెస్ట్ - మరో ముగ్గురు పరారి

On
విలేఖరి ముసుగులో జిల్లా పరిశ్రమ ల అధికారికి బెదిరింపులు. - ఇద్దరి అరెస్ట్ - మరో ముగ్గురు పరారి

విలేఖరి ముసుగులో జిల్లా పరిశ్రమ ల అధికారికి బెదిరింపులు. - ఇద్దరి అరెస్ట్ - మరో ముగ్గురు పరారి
-బ్లాక్ మేల్ తో  రూ.8.50 లక్షల వసూలు.

జగిత్యాల జనవరి 31( ప్రజా మంటలు):
 ఓ  ఛానల్ విలేకరిని అని చెప్పుకుని ఓ జిల్లా అధికారి వద్దనుండి రూ.8.50 లక్షలు వసూలు చేసి, మరిన్ని డబ్బుల కోసం డిమాండ్ చేయగా బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. దీంతో ఆ నకిలీ విలేకరితోపాటు మరొకరిని పోలీస్ లు పట్టుకొని అరెస్టు చేశారు. ఇదే కేసులో మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు. కేసుకు సంబంధించిన వివరాలను డి.ఎస్.పి రఘు చందర్ శుక్రవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. జిల్లా పరిశ్రమల కేంద్రంలో జనరల్  మేనేజర్ గా పనిచేస్తున్న ఎర్ర యాదగిరి వద్దకు ఓ ప్రముఖ చానల్ విలేకరిగా చెప్పుకొని తమ బంధువులకు సబ్సిడీ లోన్ కావాలని రాయికల్ మండలం వడ్డె లింగాపూర్ కు చెందిన భూక్య సంతోష్ నాయక్ వెళ్ళాడు.

పథకం ప్రకారం తన వెంట వచ్చిన మహిళతో రూ. 5వేలు పరిశ్రమల శాఖ అధికారికి ఇప్పించి రహస్యంగా వీడియో తీశాడు. అదే రాత్రి వీడియోను యాదగిరి కి పంపి నీవు లంచం తీసుకున్న విషయం మా ప్రెస్ గ్రూప్ లో, ఛానల్లో వేస్తామని బ్లాక్మెయిల్ చేయడంతో ఆయన భయపడి తన ఫోన్ పే ద్వారా కొంత డబ్బు పంపాడు తదుపరి    రు.1లక్ష  అందజేశాడు.

దీంతో ఆగకుండా విషయం మా ఛానల్ యాజమాన్యానికి తెలిసిందని రు.10 లక్షలు ఇస్తేనే మా చానల్లో ప్రసారం కాకుండా చేస్తానని బెదిరింపులకు దిగడంతో విడుతలవారీగా రు.8.50 లక్షలు  సంతోష్ కు అందజేశాడు ఫిర్యాదు దారు ఇంతటితో ఆగకుండా తాను విలేకరిని కాదని పోలీసు ఇంటలిజెన్స్ అధికారిని అని మీ ఆస్తుల వివరాలన్నీ మా దగ్గర ఉన్నాయని  ఇంకా రు.10 లక్షలు కావాలని మరో నలుగురు కలిసి యాదగిరిని ఓ కారులో కిడ్నాప్ చేసి బెదిరింపులకు దిగాడు.

దీంతో బాధితుడు యాదగిరి పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితుడు భూక్యా సంతోష్ నాయక్ తో పాటు పాలకుర్తి రాకేష్ ను శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్ తరలించారు. మరో ముగ్గురు నిందితులైన మాలోతు తిరుపతి, భూక్య గంగాధర్, బాలే జగన్ లు పరారీలో ఉన్నారని డిఎస్పీ తెలిపారు. నిందితుల వద్ద నుండి 2 తులాల బంగారు గొలుసు, రూ.16 వేల నగదు, స్విఫ్ట్ డిజైర్ కారు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు డి.ఎస్.పి తెలిపారు. మిగతా నిందితుల కోసం గాలిస్తున్నామని కేసు తదుపరి విచారణ కొనసాగుతుందని డిఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో టౌన్ సిఐ వేణుగోపాల్, ఎస్సై కిరణ్ ఉన్నారు.

Tags

More News...

National  International   State News 

కాంగో తిరుగుబాటుదారుల దాడిలో 700 లమంది మృతి

కాంగో తిరుగుబాటుదారుల దాడిలో 700 లమంది మృతి కాంగో తిరుగుబాటుదారుల దాడిలో 700 లమంది మృతి గోమా ఫిబ్రవరి 02:  తూర్పు డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని అతిపెద్ద నగరమైన గోమాలో ఆదివారం  జరిగిన తీవ్ర పోరాటంలో కనీసం 700 మంది మరణించారని UN తెలిపింది. రువాండా మద్దతు ఉన్న M23 తిరుగుబాటుదారులు ఉత్తర కివు ప్రావిన్స్ రాజధానిని స్వాధీనం చేసుకోవడంతో 2,800 మంది...
Read More...
Local News  State News 

మైనారిటీ కళాశాలలో కి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను అనుమతించని గురుకుల ప్రిన్సిపాల్

మైనారిటీ కళాశాలలో కి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను అనుమతించని గురుకుల ప్రిన్సిపాల్ మైనారిటీ కళాశాలలో కి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను అనుమతించని గురుకుల ప్రిన్సిపాల్ ధర్మపురి ఫిబ్రవరి 02:  ధర్మపురి మైనారిటీ కళాశాలలో కి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను జిల్లా కలెక్టర్ ఆదేశం ఇస్తేనే అనుమతి ఇస్తామని కళాశాల ప్రిన్సిపాల్, వెనిక్కి పంపివేశారు  స్వయంగా ప్రిన్సిపాల్ తో ఫోన్ లో మాజీ మంత్రి...
Read More...
Local News  State News 

కేంద్ర బడ్జెట్ బీహార్ బడ్జెట్ గా కనబడుతుంది. - ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.

కేంద్ర బడ్జెట్ బీహార్ బడ్జెట్ గా కనబడుతుంది. - ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).  జగిత్యాల ఫిబ్రవరి 2 ( ప్రజా మంటలు ) :  కేంద్ర బడ్జెట్ బీహార్ బడ్జెట్ గా కనిపిస్తోందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్ అడ్లూరి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆడ్లూరి లక్ష్మణ్...
Read More...

బీజేపీ పాలనలో షెడ్యూల్డ్ కులాల ఆర్తనాదాలు వినేవారు ఎవరూ లేరు: ప్రియాంక గాంధీ

బీజేపీ పాలనలో షెడ్యూల్డ్ కులాల ఆర్తనాదాలు వినేవారు ఎవరూ లేరు: ప్రియాంక గాంధీ బీజేపీ పాలనలో షెడ్యూల్డ్ కులాల ఆర్తనాదాలు వినేవారు ఎవరూ లేరు: ప్రియాంక గాంధీ అయోధ్య (యూపీ) ఫిబ్రవరి 02: ఉత్తరప్రదేశ్లో షెడ్యూల్డ్ కులానికి చెందిన మహిళను అనుమానాస్పద రీతిలో హత్య చేయడంపై ఎంపీలు మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్లో ఓ షెడ్యూల్డ్ కులానికి చెందిన మహిళ అనుమానాస్పదంగా హత్య చేయడం సంచలనం సృష్టించింది. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో షెడ్యూల్డ్ కులాల...
Read More...
Local News 

విజయవంతంగా ముదిరాజ్​ ప్రజా చైతన్య యాత్ర

విజయవంతంగా ముదిరాజ్​ ప్రజా చైతన్య యాత్ర విజయవంతంగా ముదిరాజ్​ ప్రజా చైతన్య యాత్ర సికింద్రాబాద్​, ఫిబ్రవరి 02 ( ప్రజామంటలు):  ముదిరాజ్​ లు గత దశాబ్దాల తరబడిగా ఎంతగా అన్యాయానికి గురవుతున్నారో ప్రజలకు వివరించడానికి ఉద్దేశించిన ముదిరాజ్​ ప్రజా చైతన్య యాత్ర పూర్తి విజయవంతమైందని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్​క్లబ్​ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముదిరాజ్ సంఘ...
Read More...
National  Sports  State News 

రెండోసారి అండర్‌-19 మహిళల ప్రపంచ కప్‌ను గెలుచుకున్న టీమిండియా జట్టు - అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత

రెండోసారి అండర్‌-19 మహిళల ప్రపంచ కప్‌ను గెలుచుకున్న టీమిండియా జట్టు - అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత రెండోసారి అండర్‌-19 మహిళల ప్రపంచ కప్‌ను గెలుచుకున్న టీమిండియా జట్టు - అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి  - ఎమ్మెల్సీ కవిత  వరుసగా రెండోసారి అండర్‌-19 మహిళల ప్రపంచ కప్‌ను గెలుచుకున్న టీమిండియా జట్టును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. ఫైనల్ మ్యాచ్ లో అద్భుతమైన ఆటతో టీమిండియా అమ్మాయిల జట్టు విజయంలో కీలక పాత్ర...
Read More...
Local News 

వైభవంగా పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం శంకుస్థాపన.

వైభవంగా పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం శంకుస్థాపన. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). మల్కాపూర్ ఫిబ్రవరి 2( ప్రజా మంటలు ) :  మల్కాపూర్ లోని శ్రీ లక్ష్మీ హోమ్స్ లో వసంత పంచమి పర్వదిన కాలాన్ని పురస్కరించుకొని పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయాన్ని శంకుస్థాపన చేశారు.. మయూరగిరి పీఠాధిపతులు, జ్యోతిష్య - వాస్తు ఆగమశాస్త్ర పండితులు శ్రీ నమిలకొండ రమణచారి...
Read More...
National  International   State News 

కెనడా, మెక్సికో లపై టారిఫ్ తొ అమెరికాలో పెరగనున్న ధరలు 

కెనడా, మెక్సికో లపై టారిఫ్ తొ అమెరికాలో పెరగనున్న ధరలు  కెనడా, మెక్సికో లపై టారిఫ్ తొ అమెరికాలో పెరగనున్న ధరలు  పెట్రోల్, కిరాణా వస్తువుల ధరలలో పెరుగుదల  వాషింగ్టన్ ఫిబ్రవరి 02: 'రాబోయే వారాలు కష్టంగా ఉంటాయి': ట్రంప్ సుంకాలకు మెక్సికో, కెనడా స్పందిస్తున్నాయిఈ విధానం గ్యాస్ మరియు కిరాణా వంటి ముఖ్యమైన ఉత్పత్తుల ధరలను పెంచే ప్రమాదం ఉంది. కెనడా ప్రధాని ట్రూడో...
Read More...
Local News  State News 

బడ్జెట్ లో తెలంగాణాకు చోటు ఉండదా? తెలంగాణా ప్రాంతానికి విలువ లేదా?? - మాజీ జెడ్పి చైర్ పర్సన్ దావ వసంత సురేష్.

బడ్జెట్ లో తెలంగాణాకు చోటు ఉండదా? తెలంగాణా ప్రాంతానికి విలువ లేదా?? - మాజీ జెడ్పి చైర్ పర్సన్ దావ వసంత సురేష్. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).  జగిత్యాల ఫిబ్రవరి 2( ప్రజా మంటలు ) :  తెలంగాణ ప్రాంతానికి బడ్జెట్లో చోటు ఉండదా తెలంగాణ ప్రాంతానికి ప్రయోజనానికి విలువ లేదా అని మాజీ జెడ్పి చైర్ పర్సన్ దావ వసంత అన్నారు. రూరల్ మండలం తిమ్మాపూర్ కండ్ల పెళ్లి హైదరాపల్లె గ్రామాలలో గ్రామ సమన్వయ...
Read More...
Local News  State News 

పట్టభద్రుల సమస్యల పరిష్కారానికై మీ ముందుకు వస్తున్న ఆశీర్వదించండి. - పట్టభద్రుల స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థి యాదగిరి శేఖర్ రావు.

పట్టభద్రుల సమస్యల పరిష్కారానికై మీ ముందుకు వస్తున్న ఆశీర్వదించండి. -  పట్టభద్రుల స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థి యాదగిరి శేఖర్ రావు. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).  గంభీరావుపేట ఫిబ్రవరి 2( ప్రజా మంటలు ) :  ఎమ్మెల్సీ ప్రచారంలో భాగంగా సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో ప్రచారం నిర్వహించిన పట్టభద్రుల స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థి యాదగిరి శేఖర్ రావు పట్టబద్రులని ఉద్దేశించి మాట్లాడుతూ.....  పట్టభద్రుల ఓటు అనేది వజ్రాయుధం కంటే పదునైనదని ఆగం కాకండి ఆలోచించి...
Read More...
Local News 

క్రికెట్ మ్యాచ్ ప్రారంభించిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.

క్రికెట్ మ్యాచ్ ప్రారంభించిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).  రాయికల్ ఫిబ్రవరి 2( ప్రజా మంటలు ) :  మండల కేంద్రంలో క్రికెట్ మ్యాచ్ రాయికల్ ప్రీమియర్ లీగ్ లో ముఖ్య అతిథిగా పాల్గొని టాస్ వేసి మ్యాచ్ ప్రారంభించారు పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ప్రెస్ క్లబ్ మరియు ప్రజాప్రతినిధుల మధ్య జరిగిన ఫ్రెండ్లి మ్యాచులో...
Read More...
Local News 

పార్కు చేసిన కారు కు నిప్పంటించిన దుండగులు.

పార్కు చేసిన కారు కు నిప్పంటించిన దుండగులు. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).  జగిత్యాల ఫిబ్రవరి 2(ప్రజా మంటలు) :  పట్టణంలోని ధరూర్ క్యాంపు హౌసింగ్ బోర్డ్ రామాలయం వెనుక పార్కు చేసి ఉన్న కారుపై గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పు అంటించారు. వినయ్ అనే వ్యక్తి తన కారును క్యాంపు లోని రామాలయం వెనుక పార్కింగ్ చేసి వ్యక్తిగత...
Read More...