మాస్టర్ ప్లాన్ లే ఔట్ లేకుండా నిర్మాణాలు చేపట్టవద్దు
జగిత్యాల జనవరి 22( ప్రజా మంటలు )
మాస్టర్ ప్లాన్ లే ఔట్ లేకుండా నిర్మాణాలు చేపట్ట వద్దు అని ఎమ్మెల్యే సంజయ్ అన్నారు.
పట్టణ 10,25,26,27,39 వార్డులలో TUFIDC నిధులు 80 లక్షలతో అభివృద్ధి పనులకు
భూమిపూజ చేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ .జగిత్యాల బీట్ బజార్ వేజ్ నాన్ వెజ్ మార్కెట్ లో 35 లక్షలతో మరుగుదొడ్లు,మిగులు పనులు పూర్తి కి శంకుస్థాపన చేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్
ఎమ్మెల్యే మాట్లాడుతూ
పట్టణ ప్రజలు మాస్టర్ ప్లాన్,లె ఔట్ లేకుండా నిర్మాణాలు చేపట్టవద్దు...
రియల్ వ్యాపారులు లేఅవుట్ ప్రకారం స్థలాలు విక్రయించాలి,,మున్సిపల్ అధికారులు లేఅవుట్ ప్రకారం నిర్మాణాలు అనుమతులు చేపట్టాలి.
మార్కెట్ అభివృద్ధి పనులు ఎన్నికల కోడ్ వల్ల కొంత ఆలస్యం అయింది.
నూకపల్లి డబల్ బెడ్ రూం ఇండ్ల ను జగిత్యాల మున్సిపల్ లో కలపడం జరిగింది అని ముఖ్యమంత్రి విదేశీ పర్యటన పూర్తి కాగానే గెజిట్ కూడా వస్తుంది అని అన్నారు.
జగిత్యాల ప్రజల అభివృద్ధి కి నిరంతరం కృషి చేస్తా అన్నారు ఎమ్మెల్యే.
జగిత్యాల పట్టణంలో ప్రతి వార్డులో అభివృద్ధి పనులకు నిదులు మంజూరు చేయటం జరిగింది,రాబోయే రోజుల్లో ప్రతి వార్డుకు మరిన్ని నిధులు మంజూరు చేస్తా అన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అడువాల జ్యోతి లక్ష్మణ్,వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్,మాజీ మున్సిపల్ చైర్మన్ గిరినాగభూషణం,కమిషనర్ చిరంజీవి,కౌన్సిలర్ లు భారతి రాజయ్య,ఆరుముళ్ళ నరసమ్మ (పవన్), రజీయుద్ధిన్, అస్మా అంజుమ్ షకీల్,అబ్దుల్ ఖాదర్ ముజాహిద్,తాజుద్దీన్,
AE శరన్ ,కౌన్సిలర్ లు,
నాయకులు,వార్డు ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.