గ్రామ సభ ద్వారా అర్హత పొందిన వారికే పధకం వర్తింపు
జగిత్యాల జనవరి 22( ప్రజా మంటలు )
గ్రామ సభలో అర్హత పొందిన వారికే పథకాలు వర్తిస్తాయని కలెక్టర్ అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న గ్రామ సభలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ బి,సత్య ప్రసాద్
బుధవారం రోజున జగిత్యాల రూరల్ మండలంలో నర్సింగాపూర్ గ్రామంలో జరుగుతున్న గ్రామ సభలో పాల్గొన్నారు.
రాష్ర్ట ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రైతు భరోసా కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇల్లు వంటి పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందని తెలిపారు.అలాగే అర్హులైన పేదవారికి ఏర్పాటు చేసిన గ్రామసభల ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని ప్రజలకు సూచించారు.
అలాగే గ్రామ సభలలో 4 పథకాలకు ద్వారా ఎంపిక చేయబడిన అర్హుల జాబితా గ్రామ సభలు అర్హుల పేర్లను ప్రవేశపెట్టారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ నాలుగు పథకాల ద్వారా అధికారులందరూ క్షేత్రస్థాయిలో సర్వే చేసి అర్హులను జాబితా గ్రామసభలో ప్రవేశ పెట్టడం జరిగిందని అన్నారు. గ్రామసభ ఆమోదంతో అర్హత పొందిన వారికి ఈ పథకాలు వర్తింపజేయడం జరుగుతుందని తెలిపారు.
ఇంకా లిస్టులో ఈ గ్రామంలో పేర్లు రాని వారు ఆందోళన చెందవలసిన అవసరం లేదని .
కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇల్లు రైతు భరోసా ఆత్మీయ భరోసాలు పథకాలు గ్రామసభలు ద్వారా ఏర్పాటు చేసిన కౌంటర్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు అని తెలియజేశారు.
జనవరి 26 తారీకు నుండి ఈ పథకాలు ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు.
రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు నిరంతర ప్రక్రియ అని కలెక్టర్ తెలియజేశారు.
రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన ప్రతినిరుపేదలకు ప్రతి పథకాన్ని అందజేస్తుందని అధికారులందరూ క్షేత్రస్థాయిలో అర్హులను గుర్తించి ప్రతి పథకానికి వర్తింపజేయాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో. ఎంపీడీవో , సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.