యువతకు స్వామి వివేకానంద స్ఫూర్తిదాయకం
ఎమ్మెల్యే సంజయ్ కుమార్ , మున్సిపల్ చైర్ పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్
జగిత్యాల జనవరి 22(ప్రజా మంటలు )
స్వామీ వివేకానంద యువతకు స్ఫూర్తిదాయకమని స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పేర్కొన్నారు.
జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో మున్సిపల్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన స్వామి వివేకానంద విగ్రహాన్ని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మున్సిపల్ చైర్ పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్ ఆవిష్కరించి, స్వామీ వివేకానంద విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు.
ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..
యువత వివేకానందుడి ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. మహనీయులను స్మరించుకోవడం మనందరి బాధ్యత అన్నారు. స్వామీ వివేకానంద సమాజ శ్రేయస్సు కోసం పాటుపడ్డారన్నారు. స్వామి వివేకానంద కోరుకున్నట్లు యువత దేశ నిర్మాణంలో భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు.
ఈసందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ మాట్లాడుతూ.
స్వామి వివేకానంద సమాజానికి చూపిన మార్గం ఆచరణీయమని , మన భవిష్యత్తుకు మనమే కర్తలమని స్వామి వివేకానంద చెప్పిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. కుల మత జాతి ప్రసక్తి లేకుండా అందరిలో దైవాన్ని చూడాలని, దీనుల్లో భగవంతుడిని చూడటమే నిజమైన ఆరాధన అని వివేకానంద చెప్పేవారని మున్సిపల్ చైర్ పర్సన్ తెలిపారు. యువత మంచి అలవాట్లతో ఉన్నత వ్యక్తిత్వాన్ని కలిగి ఉండాలని స్వామి వివేకానంద అభిలషించేవారని మున్సిపల్ చైర్ పర్సన్ గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గోలి శ్రీనివాస్ మున్సిపల్ కమిషనర్ చిరంజీవి, స్థానిక కౌన్సిలర్ చుక్క నవీన్, Dyso డా. రవిబాబు, DE నాగేశ్వర్, కౌన్సిలర్ లు జుంబర్తి రాజ్ కుమార్, గుర్రం రాము, దాసరి లావణ్య, పద్మావతి పవన్, బొడ్ల జగదీష్, నాయకులు చెట్పల్లి సుధాకర్, కొమురవెల్లి లక్ష్మి నారాయణ, స్వామి వివేకానంద సమితి సెక్రటరీ మ్యన మహేష్, టివి సూర్యం, నరేందర్ రావు, రామకృష్ణ, ఏ సి ఎస్ రాజు, సుధాకర్ రావు, గంగారాం, కత్రోజ్ గిరి, శరత్ రావు, రంగు మహేష్, రామకృష్ణ రెడ్డి, పోతునుక మహేష్, ఏనుగంటి రవి, క్రాంతి, చిట్ల మనోహర్, జంగిలీ శశి, సంకే మహేష్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.