BRS నాయకులే లక్ష్యంగా ముందు?
హైదరాబాదు జనవరి 22:
బిఆర్ఎస్ హయంలో , మంథని నియోజకవర్గంలోని గుంజపడుగుకు చెందిన ఇద్దరు హైకోర్టు న్యాయవాదుల (దంపతులు) జంట హత్య కేసును సీబీఐ కి అప్పగించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నిస్తుందా అంటే, జరుగుతున్న పరిణామాలు అలాగే కనబడుతున్నాయి.
కాంగ్రెస్ పార్టీకి ప్రత్యర్థులైన BRS నాయకులు ఇందులో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.వీరిని కట్టడి చేయడానికైనా ఈ కేసును ప్రభుత్వం తిరగడోవచ్చనే వార్తలు వస్తున్నాయి.
2021 ఫిబ్రవరి 17న జరిగిన న్యాయవాది గట్టు వామనరావు,ఆయన భార్య నాగమణి దంపతుల హత్య కేసు దర్యాప్తును సీబీఐకి ఇవ్వాలని కోరుతూ తండ్రి కిషన్ రావు 2021 సెప్టెంబర్ లో 1వినతి పత్రం ఇచ్చారు.
ఈ సంఘటపై హైకోర్టు న్యాయవాదులు కోర్టు విధులు బహిష్కరించి, నిరసన తెలిపారు.
న్యాయవాది దంపతులను పెద్దపల్లి- మంథని ప్రధాన రహదారి నడిరోడ్డుపై, పట్టపగలు కారు నుంచి లాగి వందలాదిమంది చూస్తుండగా అతి పాశవికంగా నరికి చంపిన సంఘటన అప్పట్లో సంచలనం రేపింది. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సమగ్ర దర్యాప్తు జరగలేదని వామన్ రావు తండ్రి కిషన్ రావు పిటిషన్ లో పేర్కొన్నట్టు సమాచారం.
ఈ కేసును.సీబీఐకి అప్పగించడానికి తమకు అభ్యంతరం లేదని అప్పటి తెలంగాణ ప్రభుత్వం తరపు న్యాయవాది చెప్పారని, కానీ దాన్ని అమలు పరచలేదని. న్యాయవాది వామన్ రావు తండ్రి కిషన్ రావు సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు తెలిసింది.
ఈ కేసులో అప్పటి జిల్లాపరిషత్ చైర్మన్, BRS నాయకుడు పుట్ట మధు, అతని తమ్మునికి సంబంధం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. వీరు కొన్ని రోజులపాటు అజ్ఞాతంలోకి కూడా వెళ్లారు. సప్పటి మంత్రి కొప్పుల ఈశ్వర్ సహకారంతో, కేసీఆర్ జోక్యంతో ఈ కేసు విచారణ అంతంత మాత్రంగానే జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి.
ఈ జంట హత్యల కేసులో అప్పటి అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) స్థానిక నేత, పుట్ట మధు మేనల్లుడు బిట్టు శీను అని పిలువబడే తులసెగారి శ్రీనివాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లా. ఫిబ్రవరి 19 రాత్రి ఇదే నేరంలో టీఆర్‌ఎస్ మంథని మండల అధ్యక్షుడు కుంట శ్రీనివాస్‌ను అరెస్టు చేసిన నేపథ్యంలో బిట్టు శీను అరెస్ట్ చేశారు.
మంథని శాసన సభ్యులు, రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కు ప్రధాన ప్రత్యర్థి అయిన పుట్ట మధు పై ఆరోపణలు ఉన్నందున, ఈ కేసును మళ్ళీ ఇప్పుడు తిరగదోడి,నిజమైన నిందితులను పట్టుకోవాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది.
ఈ కేసు మళ్ళీ విచారణకు వచి, అదే cbi చేతికి వెళితే మంథని, పెద్దపల్లి ప్రాంత BRS నాయకులకు చిక్కులు ఎదురుకావచ్చునని అనుకొంటున్నారు.చూడాలి న్యాయం ఏమంటుందో, దోషులు ఇప్పటికైనా పట్టుబడతారో అని ప్రజాస్వామ్యవాదులు ఎదురుచూస్తున్నారు.