జగిత్యాల అభివృద్ధే మా ఏకైక ఎజెండా.. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్ పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్
జగిత్యాల 21 ( ప్రజా మంటలు )
పట్టణ అభివృద్ధే ఏకైక మా ఎజెండాగా తాము పనిచేస్తున్నామని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్ పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్ అన్నారు.
మంగళారం జిల్లా కేంద్రంలోని 11, 12, 29, 30 వార్డులో టీయూఎఫ్ఐడిసి నిధులు 85 లక్షలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్ పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్ భూమి పూజ చేశారు.
జగిత్యాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తమ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యంపట్ల ప్రత్యేక దృష్టిసారించిందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానన్నారు.
జగిత్యాల పట్టణం లోని 4500 మంది పేదలకు నిర్మించిన నూకపల్లి అర్బన్ హౌజింగ్ కాలనీని త్వరలో జగిత్యాల మున్సిపాలిటీలో విలీనం చేయనున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.
మున్సిపల్ చైర్ పర్సన్ మాట్లాడుతూ..
పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనకు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కృషి చేస్తున్నారన్నారు.
మున్సిపల్ పరిధిలోని 48 వార్డుల అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా నిధులు కేటాయిస్తూ.. ప్రగతి పథంలో ముందుకెళ్తున్నామన్నారు.
అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని చైర్ పర్సన్ సూచించారు.
పలు వార్డుల్లో ప్రజలు రేషన్ కార్డులు లిస్ట్ లో పేరు రాలేదని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రజలు మళ్లీ ఫీల్డ్ సర్వేయర్ వార్డు ఆఫీసర్ వద్ద నమోదు చేసుకోవాలని తెలిపారు.
అర్హత గల ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు అందించే ప్రయత్నం చేస్తామని ప్రజా ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్,వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరినాగభూషణం, కమిషనర్ చిరంజీవి, కౌన్సిలర్ లు బాలే లత శంకర్, నక్క జీవన్, పంబాల రాము, దుర్గయ్య, నాయకులు అబ్దుల్ ఖాదర్ ముజాహిద్, దుమాల రాజకుమార్, మేకపవన్, మేనేని ప్రవీణ్ రావు, AE శరన్, కౌన్సిలర్లు, నాయకులు, వార్డు ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.