సంపాదించిన కోట్లు ఖర్చుపెట్టి కోట్లు దండుకోవడానికి రావట్లేదు సేవచేయడానికి సేవే పరమావధిగా మీ ముందుకు వస్తున్న
*
సిద్దిపేట/ సిరిసిల్ల జనవరి 17 (ప్రజా మంటలు)
పట్టభద్రుల ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ అభ్యర్థి యాదగిరి శేఖర్ రావు సిద్దిపేట మరియు సిరిసిల్లలోని శ్రీ చైతన్య నారాయణ విద్యాసంస్థల్లో యాజమాన్యాలతో సమావేశమై మద్దతు కోరడం జరిగింది. ఈ సమావేశంలో మాట్లాడుతూ గత 22 సంవత్సరాలుగా సేవా కార్యక్రమంలో ఒక్క సేవకుడుగ ఉన్నానని ఎమ్మెల్సీగా కాదు ఒక సేవకుడిగా మీ ముందుకు వస్తున్నానని ఆశీర్వదించి శాసనమండలికి పంపితే పట్టభద్రుల గొంతుకనై ప్రశ్నిస్తానని అన్నారు
. కోట్లు సంపాదించి ఆ సంపాదనను దాచిపెట్టుకోవడానికి లేదా కోట్ల సంపాదన ధ్యేయంగా రావడంలేదని సేవా దృక్పథంతోనే మీ ముందుకు వస్తున్నానని మీ సేవకుడిగా నన్ను శాసనమండలికి పంపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సిద్దిపేట ట్రస్మా అధ్యక్షులు గోపాలపురం సుభాష్ ,ట్రస్మా జిల్లా ఉపాధ్యక్షులు యాదగిరి మరియు సిరిసిల్ల ట్రస్మా పట్టణ అధ్యక్షులు శబరి శ్రీనివాస్ ,ఆనంతుల శ్రీనివాస్ ,పండుగ రమేష్ ట్రస్మా బాద్యులు పాల్గొన్నారు.