సంక్షేమ పథకాలు ప్రజలు సద్వినియోగ పరుచుకోవాలి
ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్ పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్*
జగిత్యాల జనవరి 17 ( ప్రజా మంటలు)
సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగ పరచుకోవాలి
అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియని జగిత్యాల పట్టణం అన్ని రంగాల్లో అభివృద్ధి పరచాలన్నదే తన సంకల్పమని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మున్సిపల్ చైర్ పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్ అన్నారు.
జగిత్యాల పట్టణ అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని జగిత్యాల ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరచాలన్నదే తన సంకల్పమని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. నియోజవర్గం అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో మరిన్నీ నిధులు మంజూరు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాష్ట్రంలోని మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ప్రజా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని తెలిపారు. మహిళల సాధికారతే లక్ష్యంగా ప్రభుత్వం నిరంతరం పాటు పడుతోందన్నారు.
పురపాలిక పరిధిలోని 5, 20, 21, 37 , వ వార్డుల్లో 85 లక్షలతో మున్సిపల్ చైర్ పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్ మున్సిపల్ కమిషనర్ చిరంజీవి కౌన్సిలర్స్ కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
మున్సిపల్ చైర్ పర్సన్ మాట్లాడుతూ..
రాష్ట్రంలో విద్య, వైద్య అభివృ ద్ధికి ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తుందని జగిత్యాల ఎమ్మెల్యే చొరవతో జిల్లా కేంద్రంలో అందరికీ అందుబాటులో వైద్య కళాశాల ఏర్పాటు చేశామని, మాత శిశు ఆసుపత్రి అందరికీ అందుబాటులో ఉండే విధంగా కృషి చేశారని పేర్కన్నారు.
జగిత్యాల పట్టణంలో అండర్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయడంతో పారిశుద్ద సమస్య తీరుతుందని చైర్ పర్సన్ అన్నారు.
రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతుందన్నారు.
పారిశ్యుద్ద పరిరక్షణకు పట్టణ ప్రజలు సహకరించాలని కోరారు.
ప్రతి వీధిలో సీసీ రోడ్డు, డ్రైనేజీ, వీధిలైట్లు ఏర్పాటు కృషి చేస్తున్నామని తెలిపారు.
ఈకార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ చిరంజీవి, స్థానిక కౌన్సిలర్ లు గుగ్గిళ్ళ హరీష్, అల్లే గంగాసాగర్ ,అనుమల్ల కృష్ణ హరి, AE అనిల్,కౌన్సిలర్ లు,కో ఆప్షన్ సభ్యులు,వార్డు నాయకులు కార్యకర్తలు, వార్డు ప్రజలు,తదితరులు పాల్గొన్నారు.