ప్రశాంతంగా ముగిసిన వైకుంఠ ఏకాదశి బందోబస్తు. ధర్మపురి లో బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ అశోక్ కుమార్
ప్రశాంతంగా ముగిసిన వైకుంఠ ఏకాదశి బందోబస్తు. ధర్మపురి లో బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల జనవరి 10:
వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని జిల్లా ఉన్న వివిధ పుణ్యక్షేత్రాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా పోలీస్ శాఖ పరంగా కావాల్సిన భద్రతాపరమైన ఏర్పాట్లను చేసి ప్రశాంతంగా నిర్వహించారని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు.
జిల్లాలో ఉన్న వివిధ పుణ్యక్షేత్రాలకి పెద్ద ఎత్తున భక్తులు వచ్చే దర్శనం చేసుకోవడం జరిగిందని,వివిధ పుణ్యక్షేత్రంలో ఏలాంటి నేరాలకు తావులేకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండ చూసిన పోలీస్ అధికారులు , క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది యొక్క కృషిని ఎస్పీ అభినందించారు.
ఇదే విధంగా రానున్న రోజుల్లో కూడా ఇదే స్ఫూర్తిని కనబరుస్తూ ప్రశాంత వాతావరణంలో పండగలను నిర్వహించడానికి పోలీస్ శాఖ తరపున కావాల్సిన భద్రతాపరమైన ఏర్పాట్లు చేయడానికి ఎల్లప్పుడూ ముందుంటామని తెలియజేశారు.
ఈ సందర్భంగా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన బందోబస్తు ఏర్పాట్లను జిల్లా ఎస్పీ స్వయంగా పరిశీలించారు.
ఎస్పీ గారి వెంట డిఎస్పి రఘు చందర్, ధర్మపురి సి.ఐ రామ్ నర్సింహారెడ్డి, ఎస్.ఐ లు, ఉదయ్ కుమార్, సతీష్, ఉమ సాగర్, శ్రీధర్ రెడ్డి ఉన్నారు