బ్యాడ్జీ నంబర్ తో సంబంధం లేకుండా డ్రైవర్ ల దరఖాస్తులు స్వీకరించాలి..దరఖాస్తు తేదీని పొడిగించాలి
బ్యాడ్జీ నంబర్ తో సంబంధం లేకుండా డ్రైవర్ ల దరఖాస్తులు స్వీకరించాలి..దరఖాస్తు తేదీని పొడిగించాలి
కొత్తగూడెం జనవరి 10:
సింగరేణి యాజమాన్యం కార్పొరేట్ స్థాయిలో ఆహ్వానించిన వాహన టెండర్ల దరఖాస్తు తేదీని పొడిగించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరారు. ఈ సందర్భంగా శుక్రవారం కొత్తగూడెం లోని జనరల్ మేనేజర్ (ట్రాన్స్పోర్ట్) సీతారామమ్ కొత్తగూడెం కార్యాలయంలో కలిసి వినతి పత్రాన్ని అందజేశారు.
అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు దుర్గం రవీందర్ మాట్లాడుతూ.. వాహన టెండర్ల దరఖాస్తు తేదీ రేపటితో ముగుస్తుందని అన్నారు. కోల్ బెల్ట్ వ్యాప్తంగా అనేకమంది మాజీ కార్మికుల పిల్లలు దరఖాస్తు చేసుకోలేదని అన్నారు. దరఖాస్తు చేసుకునేందుకు తేదీని పొడిగించాలని కోరారు. అదే విధంగా టెండర్ వేసేందుకు డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు బ్యాడ్జీ నంబర్ ఉండాలనే నిబంధనతో చాలామంది సింగరేణి మాజీ కార్మికుల పిల్లలు దరఖాస్తు చేసుకోలేదని అన్నారు.
బ్యాడ్జీ నంబర్ లేకపోయినా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించాలని కోరారు. యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పుదరి సాయి, మండల నాయకులు పర్వతి సాయి, శ్రీకాంత్ పాల్గొన్నారు.*