సకల వేదాంత సారం భాగవతం - ప్రముఖ పండితులు శంకర శర్మ
సకల వేదాంత సారం భాగవతం
- ప్రముఖ పండితులు శంకర శర్మ
రామ కిష్టయ్య సంగన భట్ల
9440595494
"సర్వ వేదాంత సారం హి శ్రీ భాగవతమీస్యతే, తద్రసామృత తృప్తస్య నాస్యత్ర స్యాద్రతి క్వచిత్", శ్రీమత్ మహాభాగవతం..."సకల వేదాంత సారం. భాగవత రసామృ తాన్ని పానం చేసిన వారికి మరే ఇత రములు రుచించవు. భాగవతం పురాణాలలో ముఖ్య స్థానాన్ని సంతరించుకుందని ఉద్ఘాటించారు ధర్మపురి క్షేత్రస్థ ప్రాచ్య డిగ్రీ కళాశాల విశ్రాంత ప్రాచార్యులు, సంస్కృతాంధ్ర పండితులు, భగవత్ సేవా పరాయణులు పెండ్యాల శంకర శర్మ.
ప్రాచీన ఆర్ష విజ్ఞా నానికి, సనాతన సాంప్రదాయాలకు పట్టుకొమ్మయై, వేద వేదాంగ శాస్త్రాగమ, సకల కళలకు,
సంస్కృతీ సభ్యతలకు ఆలవాలమై, పుణ్యభూమిగా వెలుగొందుతున్న భారతావనికి చరిత్రకు అందనంత పూర్వమైన, ఉజ్వల సాంస్కృతిక, వైదిక, తాత్త్విక, పౌరా ణిక, ఐతిహాసిక, చారిత్రక వారసత్వం కలిగిన ధర్మపురి క్షేత్రంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో శేషప్ప కళా వేదిక పై అంతర్జాతీయ ఇస్కాన్ సంస్థ
(అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం)
ఆధ్వర్యంలో మంగళ వారం
నిర్వహించిన భాగవత వ్యాఖ్యాన యుక్త 18 గ్రంథాల సెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ పండితులు పెండ్యాల శంకర శర్మ ప్రధాన ప్రాసంగికునిగా భాగవతాన్ని గురించి వివరిస్తూ...
భగవంతుని, భగవద్భక్తుల కథలు గాను, భక్తి యోగాన్ని చాటి చెపుతున్న ప్రాచీన గాధ. భక్తి, జ్ఞాన, వైరాగ్య, తత్వ, ముక్తిలతో కూడుకున్నదే భాగవతం అని వివరించారు.
భాగవతంలో వివిధ భాగాలను స్కంధాలు అంటారని వివిధ స్కంధాలలో విష్ణువు అవతారాలు, కార్యాలు, భక్తుల గాధలు, తత్వ బోధనలు, ఆరాధనా విధానాలు, ఆధ్యాత్మిక సంబంధ సంవాదాలు, భగవంతుని లీలలు, సవివర వర్ణనలతో ఉన్నాయని వివరించారు. ఇలాంటి భాగవత గొప్పతనాన్ని హిందూ బంధువులకు తెలియచేసి, అధ్యయనం, పారాయణ కోసం వ్యాఖ్యానం తో కూడి ప్రచురించి వితరణ చేస్తున్న ఇస్కాన్ సంస్థ సేవలను అభినందించారు.
ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, కవి, పండితులు, వ్యాఖ్యాత పెండ్యాల మహేందర్ శర్మ తన సుదీర్ఘ ప్రసంగంలో అపర శుక మహర్షి గుండి రాజన్న శాస్త్రి గురించి వివరించారు. భాగవతాన్ని పూర్వం పరీక్షిత్తుకు శ్రీశుక యోగీశ్వరుడు వివరించిన నేపథ్యం ఆధారంగా గుండి రాజన్న శాస్త్రి నిత్యం ప్రవచించడం, సాంప్రదాయాచరణాసక్తులైన భక్తులు క్రమం తప్పకుండా శ్రవణం గావించడంనేపథ్యాన్ని కళ్ళకు కట్టినట్లు వివరించారు. ఇస్కాన్ సంస్థ ప్రతినిధులు ప్రవీణ్ ప్రభు, ఇషావతార దాస్, మాధవ గోపీనాథ్ దాస్, కె వి సుబ్బారావు, రంగతీర్త దాస్ పాల్గొని తమ సంస్థ స్థాపన నిర్వహణా ఉద్దేశాలను వివరించారు. గచ్చిబౌలి భక్తి కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో
..పెండ్యాల శంకర శర్మ, మహేందర్, బొజ్జా రమేశ్, రాజేశ్, నర్సయ్య పూజాది కార్యక్రమాలు ప్రారంభించారు. 50మంది పండితులను సంస్థ పక్షాన సన్మానించి, భాగవతం గ్రంథాలను అందజేశారు. దేవస్థానం ఈఓ శ్రీనివాస్, సూపరింటెండెంట్ కిరణ్, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఎస్ ఆర్ ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ మరియు సైన్స్ కళాశాల వృక్ష శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో బొటానికల్ టూర్.

పహల్గాం దాడిని నిరసిస్తూ సీసీ నగర్ లో ర్యాలీ

బ్రెయిన్ ట్యూమర్ పేషంట్లకు ఎండోస్కోపిక్ విధానం ఓ వరం

ఉగ్రవాద పాకిస్తాన్ కు తగిన బుద్ధి చెప్పాలి.

పహల్గాం దాడికి నిరసనగా ఆటోడ్రైవర్ల నిరసన

నూతన ఆర్ఓఆర్ చట్టంపై జిల్లా కేంద్రంలో అవగాహన కార్యక్రమం పాల్గొన్న ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్

అందరికోసం న్యాయ విజ్ఞాన సదస్సులు - సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వర్ రావు

క్రీడలతో మానసిక ఉల్లాసం తో పాటు శారీరిక ధారుఢ్యం మరియు స్నేహభావం పెంపొందుతుంది . జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్

వాస్తవాలను తెలుసుకోకుండా సోషల్ మీడియా పోస్టులను ఫార్వర్డ్ చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం జగిత్యాల డీఎస్పీ రఘు చందర్

రోడ్డు ప్రమాదంలో అబ్బాపూర్ డీలర్ మృతి

ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ

ప్రతి ఉద్యోగికి పదవి విరమణ తప్పనిసరి ఎమ్మెల్యే డా.సంజయ్
