పట్టణ, గ్రామీణ విద్యార్థులకు ఒకే రకమైన విద్యా బోధన అందాలి

రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ చిన్నారెడ్డి 

On
పట్టణ, గ్రామీణ విద్యార్థులకు ఒకే రకమైన విద్యా బోధన అందాలి

పట్టణ, గ్రామీణ విద్యార్థులకు ఒకే రకమైన విద్యా బోధన అందాలి

- రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ చిన్నారెడ్డి 

ప్రజా భవన్ లో పిల్లలు -- ప్రజావాణి కార్యక్రమం నిర్వహణ

హైదరాబాద్ నవంబర్ 20:

గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సమకాలిన అంశాలతో పాటు పాఠ్యాంశాలపై డిజిటల్ ఆన్లైన్ తరగతులు నిరంతరంగా నిర్వహించాల్సిన అవశ్యకత ఉందని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి అభిప్రాయపడ్డారు.

బుధవారం మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్లో రాష్ట్రంలోని 10 ఉమ్మడి జిల్లాలకు చెందిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతో యూనిసెఫ్ సారథ్యంలో అలయెన్స్ ఫర్ చైల్డ్ రైట్స్ అండ్ మహిత సంస్థ  " పిల్లలు -- ప్రజావాణి " కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన చిన్నారెడ్డి మాట్లాడుతూ పట్టణాలు నగరాల్లో నివాసం ఉండే విద్యార్థులకు నూతన పద్ధతుల్లో విద్యాభ్యాస అవకాశాలు ఉంటాయని కానీ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఇలాంటి వసతులు ఉండవని అన్నారు. 

అందుకోసం పట్టణ నగర గ్రామీణ విద్యార్థులందరికీ ఒకే విధమైన విద్యా బోధన అందాల్సిన ఆవశ్యకత ఉందని ఇదే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకొని వెళ్తానని చిన్నారెడ్డి తెలిపారు. 

విద్యారంగాన్ని అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని విద్యారంగంపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టిని సారిచారని చిన్నారెడ్డి పేర్కొన్నారు అందులో భాగంగా ఈ 25 ఎకరాల స్థలంలో సమీకృత విద్యాలయాల నిర్మాణాలను చేపట్టారని చిన్నారెడ్డి వివరించారు. 

బాల్యం చాలా గొప్పదని బాల్య దశలోనే వారి భవిష్యత్తు జీవితాన్ని తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులు పిల్లల తల్లిదండ్రులు తీసుకోవాలని చిన్నారెడ్డి సూచించారు. 

ఈ కార్యక్రమంలో ప్రజావాణి స్టేట్ మోడల్ అధికారి దివ్య దేవరాజన్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిషన్ చైర్మన్ శ్రీనివాసరావు కార్మిక శాఖ అదురపు కమిషనర్ గంగాధర్ విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ వెంకటలక్ష్మి మహిళా శిశు సంక్షేమ శాఖ జన డైరెక్టర్ మోతే మహిత ప్రోగ్రాం డైరెక్టర్ రమేష్ శేఖర్ రెడ్డి, యూనిసెఫ్ ప్రతినిధులు ఖ్యాతి తివారీ, ప్రసన్ సేన్, తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రోత పాఠశాలలకు చెందిన పలువురు విద్యార్థులు పాఠశాలలలో ప్రభుత్వ పరంగా  చేపట్టాల్సిన పలు అంశాలను పిల్లల ప్రజావాణి కార్యక్రమంలో సభ దృష్టికి తీసుకువచ్చారు.

Tags