ఇంటింటి సర్వే 91శాతం పూర్తి  ధర్మపురి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్

On
ఇంటింటి సర్వే 91శాతం పూర్తి  ధర్మపురి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్

ఇంటింటి సర్వే 91శాతం పూర్తి
 ధర్మపురి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్


 (రామ కిష్టయ్య సంగన భట్ల)
ధర్మపురి నవంబర్ 19:

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రతి ఇంటి సర్వేకు సంబంధించి ధర్మపురి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వే కార్యక్రమంలో 91.26 శాతం పూర్తి చేసినట్లు మున్సిపల్ కమిషనర్ కందుకూరి శ్రీనివాస్ తెలిపారు. మంగళ వారం ధర్మపురి మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో శ్రీనివాస్ మాట్లాడుతూ, కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ ప్రారంభం చేసినట్లు తెలిపారు. మున్సిపాలిటీలో 15వార్డులు ఉండగా, 38 ఎన్యుమారెటర్ల బ్లాకులుగా విభజించి, వాటికి ఐ డి కార్డులు అందించా మన్నారు. ధర్మపురిలో 4810 కుటుంబాలు ఉండగా, 4481 సర్వే పూర్తి చేసి, జిల్లాలో ద్వితీయ స్థానంలో ఉన్నామన్నారు. 20వ తేదీ వరకు సర్వే పూర్తి కానుండగా,  21నుండి ఆన్ లైన్ లో డాటా నమోదు చేయడం జరుగుతుందన్నారు. ఎవరి వివరాల సేకరణ నమోదు కాకున్నా, తమ కార్యాలయంలో అంద చేయ వచ్చునని వివరించారు. ధర్మపురిలో ప్రధాన రహదారిపై దుకాణాల వస్తువులు ఉంచరాదని, లైన్ మార్కింగ్ చేయడం జరిగిందని, ఎవరైనా అతిక్రమిస్తే అపరాధ రుసుము వసూలు చేస్తామని స్పష్టం చేశారు. పశువులను, పందులను, గేదెలను రోడ్లపై వదల రాదని, యజమానులకు నోటీసులు అందజేస్తున్నామని, చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్లాస్టిక్ కవర్లు, వస్తువులు వాడకాన్ని నివారించాలని కోరారు.
మున్సిపల్ మేనేజర్ బాల గంగాధర్, శానిటరీ ఇన్స్పెక్టర్ గంగాధర్, మెప్మా అధికారి జలంధర్ పాల్గొన్నారు.

Tags