తెలంగాణలో లోక్ జనశక్తి పార్టీ విస్తరణ పట్ల చిరాగ్ పాశ్వాన్ సంతృప్తి
జాతీయాధ్యక్షుని తో తెలంగాణ అధ్యక్షులు కొమ్మిసేని వికాస్ బేటీ
తెలంగాణలో లోక్ జనశక్తి పార్టీ విస్తరణ పట్ల
చిరాగ్ పాశ్వాన్ సంతృప్తి
జాతీయాధ్యక్షుని తో తెలంగాణ అధ్యక్షులు కొమ్మిసేని వికాస్ బేటీ
హైదరాబాద అక్టోబర్ 25:
దేశవ్యాప్తంగా ఎస్సి, ఎస్టి జాతుల అభివృద్ధి కొరకు లోక్ జనశక్తి పార్టీని విస్తరించడానికి, నిమ్న జాతుల రాజకీయ లబ్దికొరకు నిరంతరం కృషి చేయాలని లోక్ జనశక్తి పార్టీ జాతీయ అధ్యక్షులు, కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కొమ్మినేని వికాస్ కు సూచించారు. న్యూ ఢిల్లీలో జాతీయఅధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ తో తెలంగాణ రాష్ట్ర లోక్ జనశక్తి పార్టీ అధ్యక్షుడు కొమ్మినేని వికాస్ సమావేశం అయ్యారు.
ఈ సందర్భంగా, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్రంలో పోటీ చేయడానికి తగు విధంగా పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయించారు. అవకాశం ఉన్న చోట పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ప్రభుత్వంలో భాగ్య స్వామ్యం కల్పించడానికి ప్రయత్నిస్తానని రాష్ట్ర అధ్యక్షులు కొమ్మినేని వికాస్ కు హామీ ఇచ్చారు.
ఎంతో చైతన్యవంతమైన దక్షిణాది రాష్ట్రాలలోని ఎస్సి, ఎస్టి జాతులను రాజకీయంగా మరింత చైతన్యమవతులైన భాగస్వాములుగా చేయడానికి, వారి వాటా వారికి అందించడానికి చేయాల్సిన కృషి, కార్యశాలల గురించి వీరిరువురు చర్చించారు.
తెలంగాణలో ఎస్సి,ఎస్టీలతో పాటు మైనార్టీలను కూడా కలుపుకొని ముందుకు పోవాలని, గ్రామస్థాయిలో పార్టీ కమిటీలు ఏర్పాటు చేయాలని జాతీయాధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ సూచించారు.
కేంద్ర ప్రభుత్వంలో లాటరాల్ ఎంట్రీ ద్వారా ఉన్నత స్థాయి ఉద్యోగులను నియమించడాన్ని చిరాగ్ పాశ్వాన్ వ్యతిరేకించడం, ఎస్సీలలో వర్గీకరణకు మద్దతు పలకడంతో పార్టీ ప్రతిష్ట, జాతీయ నాయకత్వం పై ఆ జాతులలో పెరిగిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని కొమ్మినేని వికాస్ సూచించారు.
తెలంగాణ రాష్ట్రంలో పార్టీ నిర్మాణం గురించి, కార్యక్రమాల గురించి ఆయనకు వివరించారు. త్వరలోనే రాష్ట్ర స్థాయి కార్యకర్తల సమ్మేళనం ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నట్లు వికాస్, చిరాగ్ పాశ్వాన్ కు తెలిపారు. దాదాపు గంటపాటు వీరిద్దరి మధ్య దక్షిణాది రాజకీయాలపై సమగ్ర చర్చ జరిగినది. తెలంగాణ లో పార్టీ విస్తరణ తీరుపట్ల చిరాగ్ పాశ్వాన్ సంతృప్తి వ్యక్తపరిచారు.