ముషీరాబాద్ లో కాంగ్రెస్ - బి అర్ ఎస్ కార్యకర్తల బాహా బాహీ  కేటీఆర్ వాహనాన్ని అడ్డుకొని దాడికి యత్నం 

On
ముషీరాబాద్ లో కాంగ్రెస్ - బి అర్ ఎస్ కార్యకర్తల బాహా బాహీ  కేటీఆర్ వాహనాన్ని అడ్డుకొని దాడికి యత్నం 

ముషీరాబాద్ లో కాంగ్రెస్ - బి అర్ ఎస్ కార్యకర్తల బాహా బాహీ 
కేటీఆర్ వాహనాన్ని అడ్డుకొని దాడికి యత్నం 

హైదారాబాద్ అక్టోబర్ 01:

గోల్నాక మూసీ బాధితులను పరామర్శించేందుకు కేటీఆర్ వెళ్తుండగా, ముషీరాబాద్‌లో కేటీఆర్‌ కారును అడ్డుకున్నారు. ఆపై దాడికి యత్నించారు. అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది, బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కాంగ్రెస్‌ కార్యకర్తలు ఏ మాత్రం తగ్గలేదు. కొందరైతే ఏకంగా కారుపైకి ఎక్కి మరీ దురుసుగా ప్రవర్తించారు.వారిని భా రా స కార్యకర్తలు అడ్డుకోవడంతో కొద్ది సేపు ఉద్రిక్తత నెలకొంది.

అనంతరం అంబర్‌పేట గోల్నాక పరిధిలోని తులసీరామ్‌ నగర్‌ వెళ్లిన కేటీఆర్‌ అక్కడ మూసీ బాధితులను పరామర్శించారు.

ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్‌కు ఓట్లు వేసిన వారిపై సీఎం పగపట్టారన్నారు. గరీబోళ్లంతా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఉన్నరని, వాళ్ల బతుకులను ఆగం చేయాలని చూస్తున్నాడని విమర్శించారు. మూసీమే లూఠో.. దిల్లీ మే బాంటో అనేది కాంగ్రెస్‌ నినాదమని విమర్శించారు. మీ ఇండ్ల మీదకు బుల్డోజర్‌ వస్తే కంటె అడ్డుపెట్టాలన్నారు. రేవంత్ రెడ్డి కాదు.. ఆయన తాత వచ్చినా ఏమీ చేయలేరన్నారు.

Ktr1

కాగా, కేటీఆర్‌ కారుపై కాంగ్రెస్‌ కార్యకర్తల దాడి ఘటనపై బీఆర్‌ఎస్‌ పార్టీ తవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజా సమస్యలపై పోరాడుతున్న ప్రతిపక్ష నాయకులపై అధికార పార్టీ నాయకులు దాడి చేయడమేనా ప్రజా పాలన అంటే అని ప్రశ్నించింది. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అని నిలదీసింది. రేవంత్‌.. నీ అప్రజాస్వామిక చర్యలకు ప్రజలు నిన్ను మూసీలో కలపడం ఖాయమని హెచ్చరించింది.

Tags

Latest Posts

ధ్యానం, యోగాతో మానసిక, శారీరక ఆరోగ్యం. - జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
ఐఎమ్ఏ , రోటరీ క్లబ్, ఆపి ఆధ్వర్యంలో ఒమేగా సుశృత హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ -పాల్గొన్న DMHO .
తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం రాష్ట్ర కార్యవర్గంలో రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్
జిల్లా సివిల్ జడ్జి మరియు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రెటరీ కే. ప్రసాద్ ని మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ దివ్యాంగుల పట్టభద్రుల సంఘం నాయకులు
ప్రపంచ గణిత మేధావి రామానుజన్‌. - జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్.