నివేషన స్థలాల కోసం జగిత్యాల జర్నలిస్టుల నిరసన. అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం
On
నివేషన స్థలాల కోసం జగిత్యాల జర్నలిస్టుల నిరసన. అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం
జగిత్యాల జూలై 30 (ప్రజా మంటలు) : నివేషన స్థలాల కోసం జగిత్యాల జర్నలిస్టులు నిరసన బాట పట్టారు.
గత 30 సంవత్సరాలుగా జర్నలిస్టుగా పనిచేస్తున్నప్పటికీ ప్రభుత్వం తమకు నివేషణ స్థలాలు ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తూ మంగళవారం స్థానిక తాసిల్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు.
ఎన్నో ఏళ్లుగా నివేషన స్థలాలు కావాలంటూ జర్నలిస్టులు ప్రభుత్వాన్ని ప్రజాప్రతినిధులను కోరుతున్నప్పటికీ తమ ఆకాంక్షలు నెరవేరడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేసి నిరసన వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు పాల్గొన్నారు.
Tags