సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి - మున్సిపల్ చైర్పర్సన్

On
సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి - మున్సిపల్ చైర్పర్సన్

సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్
జగిత్యాల జులై 15 (ప్రజా మంటలు):
వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ అన్నారు.

సోమవారం జిల్లా కేంద్రంలో 14వ వార్డు స్పెషల్ డ్రైవ్ కింద మురికి కాలువలు, నాలా పనులను పరిశలించారు.

మున్సిపల్ చైర్పర్సన్  మాట్లాడుతూ.. వర్షాకాలంలో వాతావరణంలో చోటుచేసుకునే మార్పుల ఫలితంగా సీజనల్‌ వ్యాధులైన మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్‌, చికెన్‌ గున్యా వంటి వ్యాధులతో పాటు విషజ్వరాలు ప్రబలే అవకాశం అధికంగా ఉంటుందని తెలిపారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. 

ఆరోగ్యం కాపాడుకోడానికి కాచి వడపోసిన నీటిని తీసుకోవడం మంచిదని సూచించారు. దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఓవర్‌ హెడ్‌ ట్యాంకులను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ బ్లీచింగ్‌ పౌడర్‌తో క్లోరినేషన్‌ చేయాలన్నారు. 


పరిసరాలను పరిశుభ్రంగా పాటిస్తే వ్యాధులను అరికట్టవచ్చని పేర్కొన్నారు. వర్షం నీరు నిల్వ ఉన్నచోట ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని సూచించారు. 

*అధికారులు పట్టణ పరిశుభ్రత పాటించాలి..*

పట్టణ మున్సిపల్ అధికారులు  పట్టణం లో అన్ని వార్డుల్లో డ్రైనేజీలు,  ఖాళీ స్థలంలో చెత్త చెదారం, శుభ్రపరిచి ప్రజలు ప్లాస్టిక్ కవర్లు నివారించాలని,  బ్లీచింగ్, ఫాగింగ్ చేపట్టాలని మున్సిపల్ అధికారులు సంన్వయంతో పని చేసి సీజనల్ వ్యాధులు అరికట్టేందుకు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 

ఈకార్యక్రమంలో కౌన్సిలర్ కూతురు పద్మ శేఖర్, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య మున్సిపల్ అధికారులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Tags