కోరిన వరాలిచ్చే తల్లి పోచమ్మ..కు బోనలెత్తిన -ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్
కోరిన వరాలిచ్చే తల్లి పోచమ్మ..కు బోనలెత్తిన -ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్
జగిత్యాల జులై 14 (ప్రజా మంటలు)
ఆషాడ మాస బోనాల జాతర సందర్భంగా
భక్తులు కోరిన వెంటనే కోరిన కోర్కెలు అందించే తల్లి పోచమ్మ అని మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ అన్నారు.
పద్మశాలి సేవా సంఘం వాణీ నగర్,శ్రీ లోక మాత పోచమ్మ తల్లి తారకరామ నగర్లో, గోవిందపల్లే వేంకటాద్రి నగర్ కాలని ఆధ్వర్యంలో పోచమ్మ తల్లి బోనాలు ఘనంగా నిర్వహించారు.
ఈసందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ..
పోచమ్మ బోనాలు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిరూపంమని మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ అన్నారు.
మహిళలు పెద్ద ఎత్తున బోనాలతో డప్పు చప్పుళ్లు, కోలాట నృత్యాలు, భక్తి పారవశ్యంతో పోచమ్మ ఆలయానికి చేరుకొని అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
ఈకార్యక్రమంలో కౌన్సిలర్స్ గుర్రం రాము, దాసరి లావణ్య ప్రవీణ్, కొలగని సత్యం ప్రేమలత, దేవేందర్ నాయక్, మహిళలు ,పద్మశాలి సేవా సంఘం అధ్యక్ష కార్యవర్గ సభ్యులు, వెంకటాద్రి నగర్ కాలని వాసులు, టీఆర్ నగర్ శ్రీ లోక మాత పోచమ్మ ఆలయం కమిటీ సభ్యులు పాల్గొన్నారు.