సివిల్స్ పరీక్షలో 7గురు రాజీవ్ అభయహస్తం అభ్యర్థుల విజయం - అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ ఏప్రిల్ 22:
రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం ద్వారా ఆర్థిక సహాయం పొందినవారిలో ఏడుగురు అభ్యర్థులు ఈ ఏడాది యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలో విజయవంతంగా ఉత్తీర్ణులు కావడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం కింద ఆర్థిక సహాయం పొంది, ఈ ఏడాది UPSC పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన ఏడుగురు అభ్యర్థులు వీరే : ఇట్టబోయిన సాయి శివాని, పోతరాజు హరి ప్రసాద్, రాపర్తి ప్రీతి, బానోత్ నాగరాజ నాయక్, తొగరు సూర్యతేజ, గోకమల్ల ఆంజనేయులు, రామటెంకి సుధాకర్.
సివిల్స్ లో తెలంగాణ అభ్యర్థులు రాణించాలనే ఉద్దేశంతో ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం ప్రారంభించిన తొలి ఏడాదిలోనే ఏడుగురు అభ్యర్థులు ప్రతిష్టాత్మక సివిల్ సర్వీసులకు ఎంపిక కావడం మన రాష్ట్రానికి గర్వకారణమని ముఖ్యమంత్రి అన్నారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి విజయం సాధించిన అభ్యర్థులు అందరినీ ముఖ్యమంత్రి గారు హృదయపూర్వకంగా అభినందించారు. వారంతా దేశసేవలో, జాతి నిర్మాణంలో కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. యువత తమ కలలు, ఆశయాలను నిజం చేసుకునే విధంగా వారికి మద్దతు ఇవ్వడంలో, సాధికారత కల్పించడంలో తెలంగాణ ప్రజా ప్రభుత్వ ఎల్లప్పుడూ ముందుంటుందని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఎస్ ఆర్ ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ మరియు సైన్స్ కళాశాల వృక్ష శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో బొటానికల్ టూర్.

పహల్గాం దాడిని నిరసిస్తూ సీసీ నగర్ లో ర్యాలీ

బ్రెయిన్ ట్యూమర్ పేషంట్లకు ఎండోస్కోపిక్ విధానం ఓ వరం

ఉగ్రవాద పాకిస్తాన్ కు తగిన బుద్ధి చెప్పాలి.

పహల్గాం దాడికి నిరసనగా ఆటోడ్రైవర్ల నిరసన

నూతన ఆర్ఓఆర్ చట్టంపై జిల్లా కేంద్రంలో అవగాహన కార్యక్రమం పాల్గొన్న ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్

అందరికోసం న్యాయ విజ్ఞాన సదస్సులు - సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వర్ రావు

క్రీడలతో మానసిక ఉల్లాసం తో పాటు శారీరిక ధారుఢ్యం మరియు స్నేహభావం పెంపొందుతుంది . జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్

వాస్తవాలను తెలుసుకోకుండా సోషల్ మీడియా పోస్టులను ఫార్వర్డ్ చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం జగిత్యాల డీఎస్పీ రఘు చందర్

రోడ్డు ప్రమాదంలో అబ్బాపూర్ డీలర్ మృతి

ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ

ప్రతి ఉద్యోగికి పదవి విరమణ తప్పనిసరి ఎమ్మెల్యే డా.సంజయ్
