శ్రీనివాసనగర్ లో బీజేపీ నాయకుల బస్తీబాట
సికింద్రాబాద్ ఏప్రిల్ 11 (ప్రజామంటలు):
భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా సికింద్రాబాద్ బీజేపీ ఇంచార్జీ మేకల సారంగపాణి ఆధ్వర్యంలో నాయకులు శుక్రవారం సీతాఫల్మండి శ్రీనివాస నగర్, ఫ్రైడే మార్కెట్ తదితర ప్రాంతాల్లో బస్తీబాట నిర్వహించారు. ఈసందర్బంగా బీజేపీ జిల్లా నాయకులు మేకల సారంగపాణి పార్టీ పతాకాలను ఆవిష్కరించారు. ఇంటింటికి వెళ్ళి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. స్థానిక బస్తీల్లో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్బంగా సారంగపాణి మాట్లాడుతూ...దేశంలో బీజేపీ ప్రాబల్యం నానాటికి పెరుగుతుందని,రాబోవు రోజుల్లో తెలంగాణ లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తుందన్నారు. ప్రపంచంలోనే ఏ దేశంలో కూడ ఎవరు కూడ చేయలేని ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ది పనులు మన దేశంలో ప్రధాని మోదీ ఆధ్వర్యంలో జరుగుతున్నాయని అన్నారు. ప్రజలంతా గమనిస్తున్నారని,వచ్చే ఎన్నికల్లో బీజేపీకి రాష్ర్టంలో అధికారం పక్కా అని చెప్పారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు కనకట్ల హరి,నాగేశ్వర్ రెడ్డి, రాజేశ్వర్ రావు, కిట్టు,కీర్తి, హర్షకిరన్,స్థానిక కార్యకర్తలు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
అద్దంకి వ్యాఖ్యలు అహంకారపూరితం.. కాంగ్రెస్ కాదు స్కాంగ్రెస్ పార్టీ.. బిజెపి నాయకురాలు రాజేశ్వరి.

"కొప్పుల ఈశ్వర్- 50 ఏళ్ల ప్రయాణం - ఒక ప్రస్థానం" పుస్తకావిష్కరణ

అకాల వర్షాలకు కొట్టుకపోయిన గుడిసెలు. రోడ్డు పొడవున విరిగిపడ్డ చెట్లు

బీజేపీ నేతలపై కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం

సికింద్రాబాద్ లో గుడ్ ఫ్రైడే ప్రత్యేక ప్రార్థనలు
.jpg)
మెటుపల్లి లో వాక్ఫ్ బోర్డ్ కు వ్యతిరేకంగా ముస్లింల భారీ ర్యాలీ.

విడిసి చొరవతో... రాలిన "దడువత్" డబ్బులు - ఆరేండ్ల సమస్యకు లభించిన "పరిష్కారం"

జై సూర్య ధన్వంతరి ఆధ్వర్యంలో కుంకుమ పూజలు

ఇల్లు,బడి,గుడి,ఆడవాళ్ళు ఎక్కడ గౌరవించబడితే అక్కడ స్వర్గసీమ ఉంటుంది

గొల్లపల్లి మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం..

అమర్ నాథ్ యాత్రికులకు గాంధీలో ఫిట్ నెస్ సర్టిఫికెట్లు - ఈనెల 21 నుంచి దృవపత్రాల జారీ

గాంధీ టీజీజీడీఏ జనరల్ కౌన్సిల్ మెంబర్ పోస్టులకు ఎన్నికలు
