ట్యాంక్ బాండ్ పై మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహ ఏర్పాటును స్వాగతిస్తున్నాం
అసెంబ్లీ ఆవరణలో విగ్రహం పెట్టేవరకు పోరాడుతాం - బిఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
పట్టు సడలిస్తే సాధించుకున్న 42 శాతం బీసీ రిజర్వేషన్లను అటకెక్కించే ప్రమాదం ఉంది
అసెంబ్లీలో బిల్లు పాస్ చేయడంతోనే అంతా అయిపోలేదని. ఢిల్లీలో రాష్ట్రపతి ఆమోదం పొందే వరకు యుద్ధం కొనసాగించాల్సిందే
రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లి బీసీలకు 42 రిజర్వేషన్లు కల్పించేందుకు చిత్తశుద్ధితో పోరాడాలి
బిఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
హైదరాబాద్ ఏప్రిల్ 11:
మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహం ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి సందర్భంగా కార్వాన్ చౌరస్తాలోని ఫూలే విగ్రహానికి బీసీ సంఘాల నాయకులతో కలిసి ఆమె శుక్రవారం నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కవిత మాట్లాడుతూ, తెలంగాణ జాగృతి, యునైటెడ్ ఫూలే ఫ్రంట్, బీసీ సంఘాల ఐక్య పోరాటానికి రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఫూలే జయంతి సందర్భంగా ఆయన విగ్రహం ఏర్పాటు చేస్తామని ప్రకటించడం అభినందనీయమన్నారు. ముఖ్యమంత్రి విగ్రహ ఏర్పాటుకు స్థల పరిశీలన చేయడాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహం ఏర్పాటు చేయాలన్న సర్కారు నిర్ణయం మంచిదేనని, అసెంబ్లీ ఆవరణలో ఫూలే విగ్రహాన్ని ఏర్పాటు చేసే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ 48 గంటల పాటు నిరాహార దీక్ష చేసి ఉమ్మడి రాష్ట్రంలోనే సాధించుకున్నామని ఆమె గుర్తు చేశారు. తెలంగాణ జాగృతి సామాజిక న్యాయం కోసం ప్రజల పక్షాన ఉద్యమిస్తున్న సంస్థ అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని సాధించుకున్న స్ఫూర్తితోనే మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఉద్యమిస్తున్నామని అన్నారు. ''మేమెంతో మాకంత'' అనే నినాదంతో బీసీలకు విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ల కోసం పోరాటం చేసి కొంత వరకు సాకారం చేసుకున్నామని తెలిపారు. ప్రభుత్వం ఫూలే విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పింది కదా అని మనం పట్టు సడలిస్తే సాధించుకున్న 42 శాతం బీసీ రిజర్వేషన్లను అటకెక్కించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అసెంబ్లీలో బిల్లు పాస్ చేయడంతోనే అంతా అయిపోలేదని, ఢిల్లీలో రాష్ట్రపతి ఆమోదం పొందే వరకు యుద్ధం కొనసాగించాల్సిందేనని అన్నారు. రాష్ట్రపతి ఆమోదముద్ర వేస్తేనే బీసీల రిజర్వేషన్లు పెరుగుతాయన్న విషయం గుర్తించాలన్నారు.
అప్పటి వరకు రిజర్వేషన్ల సాధన కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచాల్సిందేనన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లి బీసీలకు 42 రిజర్వేషన్లు కల్పించేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన సరిగా జరగలేదని అనేక ఫిర్యాదులు ఉన్నాయన్నారు. తమ కుటుంబాల వివరాలు సేకరించలేదని లక్షలాది మంది చెప్తున్నారని అన్నారు. ప్రభుత్వం చేసిన కుల సర్వే వివరాలు గ్రామాలు, వార్డుల వారీగా బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. అంతకుముందు మింట్ కాంపౌండ్ లోని మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహానికి బీసీ నాయకులతో కలిసి ఎమ్మెల్సీ కవిత పూలమాల వేసి నివాళులర్పించారు.
*బీసీ రిజర్వేషన్ల పెంపునకు కేంద్రంపై ఒత్తిడి పెంచాలి*
రాష్ట్ర అసెంబ్లీ, కౌన్సిల్ లో బీసీల రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ బిల్లు ఆమోదించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ రిజర్వేషన్లను నిజం చేసేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నించాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. శుక్రవారం ఎంబీ భవన్ లో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీతో ఆమె భేటీ అయ్యారు. అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహ ఏర్పాటుకు మద్దతునివ్వాలని కోరారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, బహుజనుల సాధికారతకు ప్రతీకగా పూలే విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో ప్రతిష్టించాలని కోరుతున్నామని చెప్పారు. ఇదే డిమాండ్ తో తాము అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రజల మద్దతు కూడగట్టామన్నారు.
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ల అమలుతోనే రిజర్వేషన్ల అమలుకు ఉన్న 50 శాతం పరిమితి అడ్డంకి తొలగిపోయిందన్నారు. ఇప్పటికే తొమ్మిది రాష్ట్రాల్లో 50 శాతానికి పైగా రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని తెలిపారు. ఈ పరిస్థితుల్లో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచడం కష్టతరమేమి కాదన్నారు. ఈ బిల్లును కేంద్రం ఆమోదించేలా రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి పెంచాలన్నారు. వెంటనే ప్రధాన మంత్రి అపాయింట్‌మెంట్ తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు.
కవిత పోరాటానికి మద్దతు : జాన్ వెస్లీ
అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్న ఎమ్మెల్సీ కవిత, తెలంగాణ జాగృతి పోరాటానికి పూర్తి మద్దతు తెలుపుతున్నానని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ప్రకటించారు. అసెంబ్లీ ఆవరణలో ఫూలే విగ్రహం ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన అభినందనీయమన్నారు. కుల అసమానతలను నిర్మూలించకుండా దేశం అభివృద్ధిలో ముందుకు వెళ్లదనేది తమ నమ్మకమని తెలిపారు. కుల అసమానతలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన పూలే విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేయాల్సిందేనన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కులగణన వివరాలను బహిర్గతం చేయాలన్నారు. దేశవ్యాప్తంగా కులగణన చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో జాగృతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి, యునైటెడ్ ఫులే ఫ్రంట్ కన్వీనర్ గట్టు రాంచందర్, కో కన్వీనర్ బొల్ల శివ శంకర్, యుపిఎఫ్ నాయకులు అలకుంటల హరి, కొట్టాల యాదగిరి,ఎత్తరి మారయ్య, గోపు సదనందు, విజేందర్ సాగర్ ,రాచమల్ల బాలకృష్ణ , డి కుమారస్వామి, కోల శ్రీనివాస్,డి నరేష్ కుమార్, గురం శ్రవణ్, ఏల్చాల దత్తాత్రేయ, రామ్ కోటి, గొరిగే నర్సింహ , అశోక్ యాదవ్ ,లింగం శాలివాహన, పుష్ప చారి , మధు,విజయ్ జితేంద్ర తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
అద్దంకి వ్యాఖ్యలు అహంకారపూరితం.. కాంగ్రెస్ కాదు స్కాంగ్రెస్ పార్టీ.. బిజెపి నాయకురాలు రాజేశ్వరి.

"కొప్పుల ఈశ్వర్- 50 ఏళ్ల ప్రయాణం - ఒక ప్రస్థానం" పుస్తకావిష్కరణ

అకాల వర్షాలకు కొట్టుకపోయిన గుడిసెలు. రోడ్డు పొడవున విరిగిపడ్డ చెట్లు

బీజేపీ నేతలపై కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం

సికింద్రాబాద్ లో గుడ్ ఫ్రైడే ప్రత్యేక ప్రార్థనలు
.jpg)
మెటుపల్లి లో వాక్ఫ్ బోర్డ్ కు వ్యతిరేకంగా ముస్లింల భారీ ర్యాలీ.

విడిసి చొరవతో... రాలిన "దడువత్" డబ్బులు - ఆరేండ్ల సమస్యకు లభించిన "పరిష్కారం"

జై సూర్య ధన్వంతరి ఆధ్వర్యంలో కుంకుమ పూజలు

ఇల్లు,బడి,గుడి,ఆడవాళ్ళు ఎక్కడ గౌరవించబడితే అక్కడ స్వర్గసీమ ఉంటుంది

గొల్లపల్లి మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం..

అమర్ నాథ్ యాత్రికులకు గాంధీలో ఫిట్ నెస్ సర్టిఫికెట్లు - ఈనెల 21 నుంచి దృవపత్రాల జారీ

గాంధీ టీజీజీడీఏ జనరల్ కౌన్సిల్ మెంబర్ పోస్టులకు ఎన్నికలు
