వెనుగుమట్లలో గావ్ చలో బస్తి చలో
గొల్లపల్లి ఎప్రిల్ 11 (ప్రజా మంటలు):
వికసిత్ భారత్ లక్ష్యంగా అవినీతి రహిత పారదర్శక పాలన అందిస్తున్న భారతీయ జనతా పార్టీని తెలంగాణలో ఆదరించాలని ధర్మపురి నియోజకవర్గ మాజీ కన్వీనర్ కస్తూరి సత్యం పేర్కొన్నారు.
బిజెపిఆవిర్భావవారోత్సవాల్లో భాగంగా గొల్లపల్లి మండలం వెనుగుమట్ల గ్రామంలో గావ్ చలో బస్తీ చలో కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో భాగంగా అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించి అయోధ్య కరసేవకులను సన్మానించారు పలువురు గ్రామ పెద్దలను కలిసి పార్టీకి మద్దతు తెలియజేయాలని కోరారు
కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోడీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం కేంద్రంలో వేగవంతమైన సంస్కరణలతో కాలానుగుణంగా అవసరమైన చట్టాలు రూపొందిస్తూ ప్రపంచంలో భారత్ ను ప్రబలమైన ఆర్థిక శక్తిగానిలపడానికి కృషి చేస్తోందన్నారు అవినీతి నిత్య కుంభకోణాలు తోపాటు మావోయిస్టు తీవ్రవాదం లాంటి సమస్యలకు పరిష్కారం చూపని కాంగ్రెస్ పార్టీ తన వారసత్వ రాజకీయాలతో దేశంలో ప్రాభవం కోల్పోయిందని తెలంగాణలో ఆరు హామీల పేరిట రాష్ట్ర ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రజలు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు
ఇట్టి కార్యక్రమంలో బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్ కొక్కు లక్ష్మణ్ పార్టీ ఉపాధ్యక్షుడు భీమ మహేష్ పార్టీ కార్యదర్శి సాయిని రాజు సీనియర్ నాయకులు పాదం మహేష్ పటేల్ ఏలేటి లింగారెడ్డి ఉష్కమల్ల సత్తన్న అనుమండ్ల రాఘవరెడ్డి బైరం నారాయణ స్థానిక నాయకులు జంగిలి నరసయ్య సామ అనంతరెడ్డి బొల్లం శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
అద్దంకి వ్యాఖ్యలు అహంకారపూరితం.. కాంగ్రెస్ కాదు స్కాంగ్రెస్ పార్టీ.. బిజెపి నాయకురాలు రాజేశ్వరి.

"కొప్పుల ఈశ్వర్- 50 ఏళ్ల ప్రయాణం - ఒక ప్రస్థానం" పుస్తకావిష్కరణ

అకాల వర్షాలకు కొట్టుకపోయిన గుడిసెలు. రోడ్డు పొడవున విరిగిపడ్డ చెట్లు

బీజేపీ నేతలపై కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం

సికింద్రాబాద్ లో గుడ్ ఫ్రైడే ప్రత్యేక ప్రార్థనలు
.jpg)
మెటుపల్లి లో వాక్ఫ్ బోర్డ్ కు వ్యతిరేకంగా ముస్లింల భారీ ర్యాలీ.

విడిసి చొరవతో... రాలిన "దడువత్" డబ్బులు - ఆరేండ్ల సమస్యకు లభించిన "పరిష్కారం"

జై సూర్య ధన్వంతరి ఆధ్వర్యంలో కుంకుమ పూజలు

ఇల్లు,బడి,గుడి,ఆడవాళ్ళు ఎక్కడ గౌరవించబడితే అక్కడ స్వర్గసీమ ఉంటుంది

గొల్లపల్లి మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం..

అమర్ నాథ్ యాత్రికులకు గాంధీలో ఫిట్ నెస్ సర్టిఫికెట్లు - ఈనెల 21 నుంచి దృవపత్రాల జారీ

గాంధీ టీజీజీడీఏ జనరల్ కౌన్సిల్ మెంబర్ పోస్టులకు ఎన్నికలు
