చోరికి వచ్చిన దొంగకు వింత అనుభవం..
చోరీ చేసి పారిపోతుండగా కిందపడి తలకు గాయాలు...ఆసుపత్రిలో చేర్పించి తమ ఉదారతను చాటుకున్న కాలనీ వాసులు..
సికింద్రాబాద్ ఏప్రిల్ 07 (ప్రజామంటలు):
ఓ దొంగ(35) మద్యం తాగి సెల్ ఫోన్ దొంగతనానికి వచ్చి ఇంట్లో వాళ్లు నిద్రలేవడంతో పట్టుకుంటారేమోనని భయంతో పారిపోతూ మెట్లపై నుంచి జారి పడి తీవ్ర గాయాలపాలై స్పృహత ప్పి పడిపోయాడు. దొంగేకదా చితకబాదుతామన్న ఆలోచన చేయకుండా ఆ కాలనీ వాసులు స్పృహతప్పిన దొంగను పోలీసుల సహకారంతో ఆసుపత్రిలో చేర్పించారు. ఈ ఘటన గోపాలపురం పీఎస్ పరిధిలో సోమవారం రాత్రి జరిగింది. పేషంట్ కోలుకొని, ఇంటికి వెళ్ళిపోయినట్లు సీఐ నరేశ్ తెలిపారు.
గోపాలపురం ఇన్స్పెక్టర్ నరేశ్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి... సికింద్రాబాద్ రెజిమెంటల్ బజారు మనోహర్ థియేటర్ సమీపంలోని ఓ ఇంట్లో సోమవారం అర్దరాత్రి ఓ వ్యక్తి (35) ఫుల్లుగా మద్యం తాగి దొంగతనానికి యత్నించాడు. మెట్లు ఎక్కి పైకివెల్లిన అతడు కిటికీ లో నుంచి సెల్ ఫోన్ ను దొంగిలించాడు. ఇదే సమయంలో అలికిడి కావడంతో ఇంట్లో వారు నిద్రనుంచి మేల్కొనగా ఇది గమనించిన అతడు పారిపోయేందుకు ప్రయత్నం చేశాడు. మెట్ల నుంచి కిందకు పరుగెత్తుతుండగా మెట్ల నుంచి జారి పడి గాయాలు కావడంతో పాటు స్పృహ కోల్పోయాడు. ఇది గమనించిన స్థానికులు దొంగను పట్టుకుని దేహశుద్ది చేయకుండా మానవతా దృక్పదంతో పోలీసులకు సమాచారం అందించి గాయాలపాలైన దొంగను ఆసుపత్రికి తరలించారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా ఆసుపత్రిలో చికిత్స అనంతరం సదరు సెల్ ఫోన్ దొంగ కు కుటుంబసభ్యులు ఎవరు లేకపోడంతో తనే ఒంటరిగా ఇంటికి వెళ్లిపోయినట్లు ఇన్స్పెక్టర్ నరేష్ తెలిపారు
More News...
<%- node_title %>
<%- node_title %>
అద్దంకి వ్యాఖ్యలు అహంకారపూరితం.. కాంగ్రెస్ కాదు స్కాంగ్రెస్ పార్టీ.. బిజెపి నాయకురాలు రాజేశ్వరి.

"కొప్పుల ఈశ్వర్- 50 ఏళ్ల ప్రయాణం - ఒక ప్రస్థానం" పుస్తకావిష్కరణ

అకాల వర్షాలకు కొట్టుకపోయిన గుడిసెలు. రోడ్డు పొడవున విరిగిపడ్డ చెట్లు

బీజేపీ నేతలపై కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం

సికింద్రాబాద్ లో గుడ్ ఫ్రైడే ప్రత్యేక ప్రార్థనలు
.jpg)
మెటుపల్లి లో వాక్ఫ్ బోర్డ్ కు వ్యతిరేకంగా ముస్లింల భారీ ర్యాలీ.

విడిసి చొరవతో... రాలిన "దడువత్" డబ్బులు - ఆరేండ్ల సమస్యకు లభించిన "పరిష్కారం"

జై సూర్య ధన్వంతరి ఆధ్వర్యంలో కుంకుమ పూజలు

ఇల్లు,బడి,గుడి,ఆడవాళ్ళు ఎక్కడ గౌరవించబడితే అక్కడ స్వర్గసీమ ఉంటుంది

గొల్లపల్లి మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం..

అమర్ నాథ్ యాత్రికులకు గాంధీలో ఫిట్ నెస్ సర్టిఫికెట్లు - ఈనెల 21 నుంచి దృవపత్రాల జారీ

గాంధీ టీజీజీడీఏ జనరల్ కౌన్సిల్ మెంబర్ పోస్టులకు ఎన్నికలు
