తప్పుడు ఆరోపణలతో మమ్మల్ని వేధిస్తున్నారు..
*జీహెచ్ఎమ్సీ టౌన్ ప్లానింగ్ దళిత ఎంప్లాయిస్ ఆవేదన
*ఉన్నతాధికారులకు ఫిర్యాదు
సికింద్రాబాద్ ఏప్రిల్07 (ప్రజామంటలు) :
జీహెచ్ఎమ్సీ టౌన్ ప్లానింగ్ లోని దళిత సామాజిక వర్గానికి చెందిన ఉద్యోగ సిబ్బందిని ఓసంస్థ పేరుతో ఓ వ్యక్తి తప్పుడు ఆరోపణలతో వేధిస్తున్నారని ఆరోపిస్తూ భాగ్యనగర్ జీహెచ్ఎమ్ఎస్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు సోమవారం రాష్ర్ట ప్రభుత్వ ఉన్నతాధికారులకు వినతిపత్రాలను అందచేశారు. ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ,సిటీ పోలీస్ కమిషనర్,జీహెచ్ఎమ్సీ కమిషనర్,చీఫ్ సిటీ ప్లానింగ్ ఆఫీసర్, జీహెచ్ఎమ్సీ కమిషనర్, జోనల్ కమిషనర్ లకు తమ ఆవేదనను వినతిపత్రం రూపంలో తెలిపారు. ముప్పిడి నవీన్ అనే వ్యక్తి ప్రెసిడెంట్ ఆండ్ ఫౌండర్ దళిత చేతన సంఘం పేరున గత కొంత కాలంగా జీహెచ్ఎమ్సీ లోని టౌన్ ప్లానింగ్ లోని దళిత సామాజిక వర్గానికి చెందిన ఉద్యోగ సిబ్బందిని నానా విధాలుగా ఇబ్బంది పెడుతూ, విధులకు ఆటంకం కలిగిస్తున్నారని, తమను బ్లాక్ మెయిల్ చేస్తూ, డబ్బులను డిమాండ్ చేస్తున్నాడని యూనియన్ నాయకులు పేర్కొన్నారు. అంబర్పేట, చిలకలగూడ తదితర ప్రాంతాల్లో సదరు వ్యక్తిపై అనేక పోలీసు కేసులున్నాయని, బిల్డింగ్ ఓనర్ల ఫిర్యాదు తో అనేక సార్లు అరెస్ట్ కూడ అయ్యాడని వారు పేర్కొన్నారు. ఎలాంటి ఆదారాలు లేకుండా ఈ వ్యక్తి చేస్తున్న ఆరోపణలతో టౌన్ ఫ్లానింగ్ ఉద్యోగ సిబ్బంది ఆత్మస్టైర్యం దెబ్బతింటుందన్నారు. తమ ఆరోపణలపై విచారణ జరిపి సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ బీ.శ్రీధర్, తోటి నాయకులతో కలసి సోమవారం సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ రవికిరణ్ ను కలిసి వినతిపత్రం అందచేశారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
అద్దంకి వ్యాఖ్యలు అహంకారపూరితం.. కాంగ్రెస్ కాదు స్కాంగ్రెస్ పార్టీ.. బిజెపి నాయకురాలు రాజేశ్వరి.

"కొప్పుల ఈశ్వర్- 50 ఏళ్ల ప్రయాణం - ఒక ప్రస్థానం" పుస్తకావిష్కరణ

అకాల వర్షాలకు కొట్టుకపోయిన గుడిసెలు. రోడ్డు పొడవున విరిగిపడ్డ చెట్లు

బీజేపీ నేతలపై కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం

సికింద్రాబాద్ లో గుడ్ ఫ్రైడే ప్రత్యేక ప్రార్థనలు
.jpg)
మెటుపల్లి లో వాక్ఫ్ బోర్డ్ కు వ్యతిరేకంగా ముస్లింల భారీ ర్యాలీ.

విడిసి చొరవతో... రాలిన "దడువత్" డబ్బులు - ఆరేండ్ల సమస్యకు లభించిన "పరిష్కారం"

జై సూర్య ధన్వంతరి ఆధ్వర్యంలో కుంకుమ పూజలు

ఇల్లు,బడి,గుడి,ఆడవాళ్ళు ఎక్కడ గౌరవించబడితే అక్కడ స్వర్గసీమ ఉంటుంది

గొల్లపల్లి మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం..

అమర్ నాథ్ యాత్రికులకు గాంధీలో ఫిట్ నెస్ సర్టిఫికెట్లు - ఈనెల 21 నుంచి దృవపత్రాల జారీ

గాంధీ టీజీజీడీఏ జనరల్ కౌన్సిల్ మెంబర్ పోస్టులకు ఎన్నికలు
