మండల నాయి బ్రాహ్మణ సేవా సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక
ఇబ్రహీంపట్నం మార్చి 25 (ప్రజా మంటలు దగ్గుల అశోక్ ):
జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో నాయి బ్రాహ్మణ సేవా సంఘ భవనంలో మంగళవారం మండల నాయి బ్రాహ్మణ సంఘ సభ్యులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సంఘ సభ్యులు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. నాయి బ్రాహ్మణ సేవా సంఘం మండల అధ్యక్షుడిగా వర్షకొండ గ్రామానికి చెందిన సమ్మెట రాజేష్, ఇబ్రహీంపట్నం గ్రామానికి చెందిన పసునూరి ఆంజనేయులు ప్రధాన కార్యదర్శిగా, గోదూరు గ్రామానికి చెందిన రాచకొండ రవి ఉపాధ్యక్షుడిగా, కోమటి కొండాపూర్ గ్రామానికి చెందిన వెల్లుల్ల రమేష్ కోశాధికారిగా, అమ్మక పేట గ్రామానికి చెందిన చింతకుంట రాజ గంగారాము గౌరవ అధ్యక్షుడిగా మండల నాయి బ్రాహ్మణ సేవా సంఘ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు మూడు సంవత్సరాల వరకు పదవిలో కొనసాగుతారని సభ్యులు తెలిపారు. కార్యవర్గ సభ్యులుగా సమ్మెట హన్మండ్లు, ఆషాడపు శోభన్, సమ్మెట శ్రీనివాస్, మిరుదొడ్డి రవి, చింతకుంట భూమన్న లను ఏకగ్రీవంగా సభ్యులు ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో మండలంలోని అన్ని గ్రామాల నాయి బ్రాహ్మణ సంఘ సభ్యులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
సన్న బియ్యం పేదల పాలిట వరం ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఛలో ఢిల్లీ ధర్నాకు తరలిన జగిత్యాల జిల్లా బిసి నాయకులు
.jpeg)
రామలింగేశ్వర ఆలయం ఆధ్వర్యంలో ఎడ్లబండ్ల పోటీలు

సేవ చేయాలనే సీనియర్ సిటిజన్స్ సంకల్పం గ్రేట్ *మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని

జీవితంపై విరెక్తి చెంది ఉరి వేసుకుని ఆత్మహత్య

72 సం, వృద్ధురాలు ఆత్మహత్య.

పూట గడవని దుస్థితి...మందులు కొనలేని పేదరికం *అండగా నిలిచిన ఎన్జీవో సంస్థ

శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా కొనసాగుతున్న హనుమాన్ చాలీసా పారాయణం

అయోధ్య నుండి శ్రీలంక వరకు నడుపుతున్న రామాయణ ఎక్స్ప్రెస్ గుంతకల్లు స్టాప్ ఉండాలని వినతి పత్రం అందజేసిన బిజెపి మహిళ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు

షిరిడి సాయి సప్తాహం ప్రారంభం

స్వయంభు గుండు మల్లన్న ఆధ్వర్యంలో ఎడ్ల బండ్ల పోటీలు

వైభవంగా శ్రీ రామలింగేశ్వర స్వామి జాతర ఉత్సవాలు
