నిన్ను నువ్వు తెలుసుకోవడమే అసలైన విద్య
సికింద్రాబాద్ మార్చి 23 (ప్రజామంటలు):
ప్రతి ఒక్కరిలో ఉండే శక్తి సామర్థ్యాలను వెలికి తీసేదే అసలైన విద్య అని, తనకు తాను పూర్తిగా తెలుసుకున్నప్పుడే వ్యక్తిత్వ వికాసం పెరుగుతుందని ప్రముఖ సామాజిక కార్యకర్త, రామకృష్ణ మఠం వాలంటీర్ ఆరేపాటి వెంకట నారాయణ రావు చెప్పారు.
ఆత్మసాక్షాత్కారానికి తోడ్పడేది నిజమైన విద్య అని చెప్పారు. సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్ లోని హరిహర కళాభవన్ లో శాంతినికేతన్ విద్యాసంస్థల 'శాన్ " స్కూల్ వార్షికోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. భారత్ ను విశ్వ గురువుచేయాలన్న స్వామి వివేకానంద కలను విద్యార్థులే సాకారం చేయగలరని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. విలువలతో కూడిన విద్యను అందిస్తున్న శాంతినికేతన్ స్కూల్ యాజమాన్యాన్ని ఆయన ప్రశంసించారు.
ఈ సందర్భంగా విద్యా సంవత్సరంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినీ విద్యార్థులకు సర్టిఫికెట్లు, మెడల్స్ అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా మార్షల్ ఆర్ట్స్ ఊపిరి బిగబట్టేలా చేశాయి. కార్యక్రమంలో శాంతినికేతన్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ యాజమాన్యం, ప్రిన్సిపాల్స్, యోగ గురువు లివాంకర్, మణిశంకర్ మణికంఠన్, శ్రీవిద్య, శ్రీధర్ పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
సన్న బియ్యం పేదల పాలిట వరం ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఛలో ఢిల్లీ ధర్నాకు తరలిన జగిత్యాల జిల్లా బిసి నాయకులు
.jpeg)
రామలింగేశ్వర ఆలయం ఆధ్వర్యంలో ఎడ్లబండ్ల పోటీలు

సేవ చేయాలనే సీనియర్ సిటిజన్స్ సంకల్పం గ్రేట్ *మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని

జీవితంపై విరెక్తి చెంది ఉరి వేసుకుని ఆత్మహత్య

72 సం, వృద్ధురాలు ఆత్మహత్య.

పూట గడవని దుస్థితి...మందులు కొనలేని పేదరికం *అండగా నిలిచిన ఎన్జీవో సంస్థ

శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా కొనసాగుతున్న హనుమాన్ చాలీసా పారాయణం

అయోధ్య నుండి శ్రీలంక వరకు నడుపుతున్న రామాయణ ఎక్స్ప్రెస్ గుంతకల్లు స్టాప్ ఉండాలని వినతి పత్రం అందజేసిన బిజెపి మహిళ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు

షిరిడి సాయి సప్తాహం ప్రారంభం

స్వయంభు గుండు మల్లన్న ఆధ్వర్యంలో ఎడ్ల బండ్ల పోటీలు

వైభవంగా శ్రీ రామలింగేశ్వర స్వామి జాతర ఉత్సవాలు
