అందాల పోటీల పేర మహిళల కించపరచడం తగదు - దేవీప్రసాద్
BRS పార్టీని విమర్శిందమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి పాలనా?
హైదరాబాద్ మార్చ్ 21:
నిన్న కారుణ్య నియామకల సందర్భంగా రవీంద్ర భారతి లో ముఖ్యమంత్రి చేసిన ప్రసంగం బీ ఆర్ ఎస్ పార్టీపై విష ప్రచారం చేయడానికి ఉపయోగించుకోవడం దుర్మార్గం, ప్రపంచ అందాల పోటీలు వద్దంటే ప్రభుత్వం ఎందుకు బీ ఆర్ ఎస్ పై ఎదురు దాడి చేస్తోందసి, ఈ పోటీలు మహిళను కించపరచాడినికేనా అని బిఅరెస్ నాయకులు,వివరేజేస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవి ప్రసాద్ ఆక్షేపించారు
అందాల పోటీలకు వ్యతిరేకంగా మహిళలలు అనేకసార్లు ఆందోళన చేసిన సంగతి రేవంత్ రెడ్డి కి తెలియదా? టూరిజం పేర ఎలాంటి అశ్లీల కార్యక్రమాలకైనా అనుమతి ఇస్తారా? దేశ వ్యాప్తంగా మహిళలు అందాల పోటీలకు వ్యతిరేకంగా వీరోచిత పోరాటాలు చేసిన సంగతి కాంగ్రెస్ కు తెలియదా? మహిళల పక్షాన బాధ్యత గల ప్రతిపక్షం గా ప్రశ్నిస్తే ఎదురు దాడి చేస్తారా,అందాల పోటీలు కావాలాని ప్రజలు అడగలేదు ఆరు గ్యారెంటీలు కావాలని డిమాండ్ చేస్తున్నారు,నూతనంగా ఉద్యోగంలో చేరుతున్న కారుణ్య ఉద్యోగులకు బాధ్యతలు, తెలంగాణ సంస్కృతి తో పాటు పని సంస్కృతి గురించి, తెలంగాణ సామాజిక జీవన విధానం, అసమానతలు, జరిగిన సామాజిక ఉద్యమాల చరిత్ర అవగాహన కల్పించే బదులు గత ప్రభుత్వం పేర బీ ఆర్ ఎస్ పై రాజకీయ విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు
రాష్ట్రం లో 3/24 నుండే ఉద్యోగుల రిటైర్ మెంట్ ప్రారంభమైంది, పెన్షనర్స్ కు ప్రభుత్వం ఇచ్చే ప్రయోజనాలు గత ప్రభుత్వం పెండింగ్ పెట్టిందని చెప్పడం అవగాహన రాహిత్యం, పాలన పై పట్టు కాదు ప్రజల పట్ల గౌరవం ఉండాలి, ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తే కేటీఆర్ హరీష్ రావు ను బెదిరించడం ఏడవ గ్యారెంటీ హామీ అమలు చేయడమే ఆరు గ్యారెంటీలు ఎగ్గొట్టడమే,952 నూతనంగా ఉద్యోగాలు కల్పించడం స్వాగతిస్తాం కానీ ప్రభుత్వ కార్యక్రమాలలో రాజకీయ ఉపన్యాసాలు ఇచ్చి రాష్ట్ర భవిష్యత్ కోసం నిరంతరం కృషి చేసే యువ ఉద్యోగుల మనసులు కలుషితం చేస్తే ఊరుకోము, ఇప్పటికే 8000 కోట్లు పెన్షనర్స్ కు పెండింగ్ లో ఉండగా మరో పదివేలు రిటైర్ మెంట్ అవుతున్నారు వారికి ఇవ్వలిసిన 8000 కోట్లు ప్రతి నెల 300 కోట్లు చెల్లిస్తే ఎన్ని ఏండ్లు చెల్లిస్తారు, ఇప్పటికే అనేక మంది ఉద్యోగులు కోర్ట్ లో న్యాయం కోసం ఆశ్రయిస్తున్నారు చివరికి వారికి ఇవ్వలిసిన ప్రయోజనాల కోసం కార్యాలయాలు వేలం వేసే రోజులు వస్తాయని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు, పి ఆర్ సి ఎగ్గొట్టే పనిలో ప్రభుత్వం ఇలాంటి ప్రచారానికి దిగడం సరికాదు, కరువు భత్యం కూడా ఇవ్వని ప్రభుత్వం ఇప్పటికైనా ఉద్యోగుల సమస్యల పై దృష్టి పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం, రాజకీయాలు ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం ,కానీ రోజు కేసీఆర్ పాలనలో జరిగిందంతా విధ్వంసం అని విష ప్రచారం చేస్తూ 15 నెలలు గడిచింది, ప్రజలు తగిన సమయం ఇచ్చారు, ఎందుకు కాంగ్రెస్ పార్టీ ని గెలిపించామని పునరాలోచనలో పడ్డారు, ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ప్రజలే సరయిన సమయం లో తమ సత్తా ఏమిటో చూపిస్తారని దేవీప్రసాద్ ఒక ప్రకటనలో అన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
నేటి ఉగాది పర్వదినం పురస్కరించుకుని ప్రజలతో మమేకం అయి సంబరాలు జరుపుకున్న జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్.

కేంద్ర మంత్రివర్యులు ప్రహ్లాద్ జోషి ని తిమ్మంచర్ల ఎఫ్సీఐ గోడన్ కి సంబంధించిన విషయం పైన కలిసిన వనగొంది విజయలక్ష్మి

శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయములో పంచాంగ శ్రవణం

వెలమ సంక్షేమ మండలి ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం* పాల్గొన్న ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ రాధిక

అంగరంగ వైభవంగా ఉగాది జాతర ఉత్సవాలు

ధర్మపురి పండితులకు అరుదైన గౌరవం

వర్షకొండ గ్రామంలో ఎంపీ నిధులతో ఐమాక్స్ లైట్,

వాల్మీకి ఆవాసంలో ఉగాది వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్.

శ్రీ లక్ష్మీ గణేష మందిరంలో విశ్వావసు సం " పంచాంగ శ్రవణం

ప్రశాంతంగా రంజాన్ వేడుకలు * ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి

వేసవికాలంలో తాగునీటికి ఎద్దడి లేకుండా చూడాలి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్

రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
