ఆడపిల్లల చదువు ఎంతో ముఖ్యం - కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి
* ప్రైవేట్ స్కూళ్ళ నిర్వహణ సవాళ్ళతో కూడుకున్నది
* కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి
సికింద్రాబాద్ మార్చి 16 (ప్రజామంటలు) :
ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఆడపిల్లలకు చదువు ఎంతో ముఖ్యమని, తల్లిదండ్రులు తమ పిల్లల చదువు విషయంలో మాత్రం రాజీ పడవద్దని, ఈ రోజుల్లో చదువుతోనే పిల్లల భవిష్యత్ ఆధారపడి ఉందని కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి అన్నారు. ముషీరాబాద్ గాంధీ నగర్ సురభి బాలవిహార్ స్కూల్ దగ్గర ఎస్ఆర్కే గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఉదాన్ ఉత్సవ్–2025 వార్షికోత్సవ వేడుకలకు కేంద్ర మంత్రి ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈసందర్బంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ...ఈ రోజుల్లో ప్రైవేట్ పాఠశాలల నిర్వహణ అనేక సవాళ్ళతో కూడుకున్నదన్నారు. ఈ విషయంలో కరస్పాండెంట్లను అభినందిచాలన్నారు. ఓ వైపు తాము ఉపాధి పొందుతూ, నలుగురికి ఉపాధి కల్పిస్తూ , రేపటి భావి భారత పౌరుల తయారీలో ప్రైవేట్ స్కూల్స్ నిర్వాహకులది కీలకపాత్ర ఉందన్నారు. ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ..ప్రతి ఒక్క విద్యార్థి కష్టపడి చదువుకొని భవిష్యత్ లో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు. రిటైర్ట్ ఐఏఎస్ అధికారి డా.బి.జనార్థన్ రెడ్డి మాట్లాడుతూ...ప్రస్తుత వ్యవస్థ బాగుపడాలంటే ఎడ్యుకేషన్ ఎంతో అవసరమని, చదువుకున్న పిల్లలే రేపటి భారత దేశాన్ని ప్రపంచంలోనే ఉన్నత స్థానంలో నిలిపేవారని అన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా భారత దేశ రక్షణకై త్రివిధ దళాలగా కాన్సెప్ట్ పైన ప్రీ ప్రైమరీ చిల్డ్రన్స్ మరియు భారతదేశ సంస్కృతి పైన ఒకటి నుండి 5వ తరగతి విద్యార్థులు ఆపై తరగతి వాళ్ళు మాతృ ప్రేమ తండ్రికి గౌరవం ఆడపిల్లల్ని ఏ విధంగా అభిమానించాలని చదువు యొక్క ప్రాముఖ్యతను తెలుపుతూ సాంస్కృతిక కార్యక్రమాలు జరిగినాయి ఇందులో ముఖ్యంగా దశావతారాలు కుంభమేళా నవదుర్గ అవతారాల సాంగ్స్ సాంగ్స్ యొక్క నృత్యాలు తల్లిదండ్రులను అలరించినాయి. బీజేపీ మహంకాళి జిల్లా అద్యక్షులు గుండగోని భరత్ గౌడ్, కార్పొరేటర్ పావని వినయ్ కుమార్, అబ్బాస్, డాక్టర్ ఫణి పవన్, ఎస్ఆర్కే గ్రూఫ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ప్రిన్సిపాల్ సుజాత, గ్రూఫ్ ఆఫ్ చైర్మన్ శివరామకృష్ణ ఆచార్య, విద్యార్థులు, పేరేంట్స్ పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ వార్షికోత్సవ, కళ్యాణ కరపత్రికను ఎమ్మెల్యే సంజయ్ కు అందజేత
.jpg)
శ్రీ సీతారాముల కళ్యాణం కరపత్రికను ఆవిష్కరించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ప్రజలకు పోలీస్ శాఖను మరింత చేరువ చేయడానికే ఇబ్బందుల నివారణ దినోత్సవం జిల్లా ఎస్పీ అశోక్ కుమార్,
.jpg)
పదవి విరమణ పొందుతున్న హోం గార్డ్ రాములు కు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆత్మీయ వీడ్కోలు

#STOP ILLEGAL DUMPING IN HINDU GRAVEYARD - ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి.

కల్వకుంట్ల కవితకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి జి రాజేశం గౌడ్

బుగ్గారం సర్పంచ్ పై క్రిమినల్ కేసులు నమోదు చేయండి

బ్రహ్మోత్సవాలలో మొక్కులు తీర్చుకున్న భక్తులు, బ్రహ్మ పుష్కరిణిలో... కోనేటి రాయుని జలవిహారం

సీపీఆర్ చేసి పాదచారిని కాపాడిన ట్రాఫిక్ పోలీసులు

ఆడపిల్లల చదువు ఎంతో ముఖ్యం - కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి

సి ఎం సహాయనిది చెక్కులు నిరుపేదలకు వరం ఎమ్మెల్యే డా. సంజయ్

గంజాయి అమ్ముతున్న మూథా అరెస్ట్
