రోడ్డు ప్రమాదంతో సీనియర్ పంచాయతీ కార్యదర్శి మృతి
జగిత్యాల మార్చ్ 04:
జగిత్యాలలోని కరీంనగర్ బైపాస్ రోడ్డు చౌరస్తాలో ఫిబ్రవరి 28న సాయంత్రం 7-01 గంటలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సీనియర్ పంచాయతీ కార్యదర్శి మహ బూబ్ పాషా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళ వారం సాయంత్రం మృతి చెందారు.
రెండు ద్విచక్ర వాహనాలు డీ కొనగా, ఇతనికి తీవ్ర గాయాల పాలయ్యాడు.వెంటనే ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదారాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. గత నాలుగు రోజులుగా చికిత్స పొందిన మహబూబ్ పాషా కు బ్రెయిన్ ఆపరేషన్ కూడా చేసినట్లు తెలిసింది. అయినా ఫలితం లేకుండా పోయింది. మంగళ వారం సాయంత్రం ఆయన నిమ్స్ ఆసుపత్రిలోనే తుది శ్వాస విడిచారు.
జగిత్యాలకు చెందిన మహబూబ్ పాషా గతంలో బుగ్గారం జి.పి లో సీనియర్ పంచాయతీ కార్యదర్శిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన వెల్గటూర్ మండలం జగదేవ్ పేట పంచాయతీ కార్యదర్శిగా పని చేస్తున్నారు. ఉమ్మడి ధర్మపురి మండలంలోని అనేక గ్రామాలతో పాటు ధర్మపురి నియోజక వర్గంలోని పలు గ్రామాలలో కూడా ఆయన ఇంచార్జీ పంచాయతీ కార్యదర్శిగా పని చేశారు. నూతన పంచాయతీ కార్యదర్శుల నియామకం జరిగేంత వరకు పంచాయతీ కార్యదర్శుల కొరత కారణంగా ఏక కాలంలోనే పలు గ్రామాలకు పంచాయతీ కార్యదర్శి గా విధులు నిర్వహించారు.మృతుడు మహబూబ్ పాషాకు తల్లి, భార్య, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
సన్న బియ్యం పేదల పాలిట వరం ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఛలో ఢిల్లీ ధర్నాకు తరలిన జగిత్యాల జిల్లా బిసి నాయకులు
.jpeg)
రామలింగేశ్వర ఆలయం ఆధ్వర్యంలో ఎడ్లబండ్ల పోటీలు

సేవ చేయాలనే సీనియర్ సిటిజన్స్ సంకల్పం గ్రేట్ *మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని

జీవితంపై విరెక్తి చెంది ఉరి వేసుకుని ఆత్మహత్య

72 సం, వృద్ధురాలు ఆత్మహత్య.

పూట గడవని దుస్థితి...మందులు కొనలేని పేదరికం *అండగా నిలిచిన ఎన్జీవో సంస్థ

శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా కొనసాగుతున్న హనుమాన్ చాలీసా పారాయణం

అయోధ్య నుండి శ్రీలంక వరకు నడుపుతున్న రామాయణ ఎక్స్ప్రెస్ గుంతకల్లు స్టాప్ ఉండాలని వినతి పత్రం అందజేసిన బిజెపి మహిళ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు

షిరిడి సాయి సప్తాహం ప్రారంభం

స్వయంభు గుండు మల్లన్న ఆధ్వర్యంలో ఎడ్ల బండ్ల పోటీలు

వైభవంగా శ్రీ రామలింగేశ్వర స్వామి జాతర ఉత్సవాలు
