ఉత్తమ ఫలితాలు సాధించి శ్రీ కాసుగంటి నారాయణరావు ప్రభుత్వ జూనియర్ కళాశాలకు పేరు తేవాలి
జగిత్యాల మార్చి 3(ప్రజా మంటలు)
హైకోర్టు బార్ కౌన్సిల్ సభ్యులు, వకీలు కాసుగంటి లక్ష్మణ్ కుమార్
-ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు కాసుగంటి కుటుంబం మరియు జస్టిస్ పుల్ల కార్తిక్ నగదు పురస్కారాలను ప్రకటించిన కాసుగంటి లక్ష్మణ్ కుమార్
ఇంటర్మీడియట్లో ఉత్తమ ఫలితాలు సాధించి శ్రీ కాసుగంటి నారాయణరావు ప్రభుత్వ జూనియర్ కళాశాలకు పేరు తేవాలని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు బార్ కౌన్సిల్ సభ్యులు, వకీలు కాసుగంటి లక్ష్మణ్ కుమార్ విద్యార్థులను కోరారు. సోమవారం మధ్యాహ్నం 12-30 గంటల ప్రాంతంలో శ్రీ కాసుగంటి నారాయణరావు బాలుర జూనియర్ కళాశాల ఆవరణలో కళాశాల ప్రిన్సిపాల్ డా. దాసరి నాగభూషణం ఆధ్వర్యంలో పరీక్షలపై అవగాహన పేరిట జరిగిన కార్యక్రమంలో కాసుగంటి లక్ష్మణ్ కుమార్ తో పాటు శ్రీ కాసుగంటి నారాయణరావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఏ అశోక్, కళాశాల వైస్ ప్రిన్సిపల్ ఆడెపు శ్రీనివాస్, అధ్యాపక బృందం సాయి మధుకర్, లెఫ్టినెంట్ రాజు, గోవర్ధన్ తో పాటుగా, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కమిటీ సభ్యుడు, జర్నలిస్ట్ సిరిసిల్ల శ్రీనివాస్ మరియు పలువురు జూనియర్ కళాశాల అధ్యాపక బృందం పాల్గొన్నారు. ఈ సందర్భంగా రానున్న ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచిన ఎస్ కే ఎన్ ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల సైన్స్ మరియు ఆర్ట్స్ విద్యార్థులకు కాసుగంటి కుటుంబం తరఫున మరియు జస్టిస్ పుల్లా కార్తీక్ ప్రకటించిన మేరకు విద్యార్థులకు నగదు పురస్కారాన్ని అందిస్తామని కాసుగంటి లక్ష్మణ్ కుమార్ ప్రకటించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
సన్న బియ్యం పేదల పాలిట వరం ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఛలో ఢిల్లీ ధర్నాకు తరలిన జగిత్యాల జిల్లా బిసి నాయకులు
.jpeg)
రామలింగేశ్వర ఆలయం ఆధ్వర్యంలో ఎడ్లబండ్ల పోటీలు

సేవ చేయాలనే సీనియర్ సిటిజన్స్ సంకల్పం గ్రేట్ *మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని

జీవితంపై విరెక్తి చెంది ఉరి వేసుకుని ఆత్మహత్య

72 సం, వృద్ధురాలు ఆత్మహత్య.

పూట గడవని దుస్థితి...మందులు కొనలేని పేదరికం *అండగా నిలిచిన ఎన్జీవో సంస్థ

శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా కొనసాగుతున్న హనుమాన్ చాలీసా పారాయణం

అయోధ్య నుండి శ్రీలంక వరకు నడుపుతున్న రామాయణ ఎక్స్ప్రెస్ గుంతకల్లు స్టాప్ ఉండాలని వినతి పత్రం అందజేసిన బిజెపి మహిళ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు

షిరిడి సాయి సప్తాహం ప్రారంభం

స్వయంభు గుండు మల్లన్న ఆధ్వర్యంలో ఎడ్ల బండ్ల పోటీలు

వైభవంగా శ్రీ రామలింగేశ్వర స్వామి జాతర ఉత్సవాలు
