మెడికల్ కాలేజీలు, ఆసుపత్రిల పై సమీక్ష నిర్వహించిన మంత్రి రాజనర్సింహ- పాల్గొన్న ఎమ్మెల్యే దా సంజయ్ కుమార్
హైదరాబాద్ మార్చి3( ప్రజా మంటలు)
హైదరాబాధ్ లో గౌరవ ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర రాజనర్సింహ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్రంలో మంజూరైన మెడికల్ కాలేజీల పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించగా ఈ సమీక్ష సమావేశంలో పాల్గొన్న జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్
తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఫేస్-1 లో మంజూరైన జగిత్యాల మెడికల్ కాలేజీ ఆసుపత్రితో పాటు రాష్ట్రంలో ఇతర కాలేజీల పనుల పురోగతి ఏ దశలో ఉందని అధికారులను సమీక్ష సమావేశంలో అడిగి తెలుసుకున్న మంత్రివర్యులు.
జగిత్యాల ఆస్పత్రిలో 650 పడగలకు గాను 330 పడకల ఆసుపత్రి గా ఉందని, మిగిలిన 320 పడగల ఆసుపత్రి పనుల కోసం ప్రభుత్వం గత నవంబర్ 29 న జీవో జారీ చేయడం జరిగిందని అట్టి పనుల నిమిత్తం టెండర్లు పిలవాలని,నూతన ఆసుపత్రి పనులు చేపట్టాలని టి జి ఎం ఐ డి సి యండి, సి ఈ ని మంత్రి ఆదేశించారు.జగిత్యాల జిల్లా కేంద్రం లో నిర్మాణ పనులు పూర్తయిన మెడికల్ కాలేజి పనులకు బిల్లుల చెల్లింపుల విషయంలో కొంత ఆలస్యం జరుగుతుందని అట్టి బిల్లులను చెల్లించడం ద్వారా మెడికల్ కళాశాల విద్యార్థులకు వసతి గృహం,హాస్టల్ మరియు తరగతి గదుల పనులు త్వరితగతిన పూర్తి కావడానికి అవకాశం ఉందని విద్యార్థులను చాలా ఉపయోగం గా ఉంటుంది అని మంత్రి దామోదర రాజనర్సింహ ని కోరగా స్పందించిన మంత్రి పెండింగ్ బిల్లులు చెల్లించే విధంగా సంబందిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారని అన్నారు జగిత్యాల శాసనసభ్యులు.జిల్లా కేంద్రం లో నిర్మించిన క్రిటికల్ కేర్ యూనిట్ కి అవసరమైన సామాగ్రి,ప్రారంభోత్సవం విషయం పై కూడా మంత్రి తో చర్చించారు. ఎమ్మెల్యే
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సెక్రటరీ క్రిస్టినా , టి జి ఎం ఐ డి సి ఎం డి , ఆర్ అండ్ బి సి ఈ, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
సన్న బియ్యం పేదల పాలిట వరం ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఛలో ఢిల్లీ ధర్నాకు తరలిన జగిత్యాల జిల్లా బిసి నాయకులు
.jpeg)
రామలింగేశ్వర ఆలయం ఆధ్వర్యంలో ఎడ్లబండ్ల పోటీలు

సేవ చేయాలనే సీనియర్ సిటిజన్స్ సంకల్పం గ్రేట్ *మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని

జీవితంపై విరెక్తి చెంది ఉరి వేసుకుని ఆత్మహత్య

72 సం, వృద్ధురాలు ఆత్మహత్య.

పూట గడవని దుస్థితి...మందులు కొనలేని పేదరికం *అండగా నిలిచిన ఎన్జీవో సంస్థ

శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా కొనసాగుతున్న హనుమాన్ చాలీసా పారాయణం

అయోధ్య నుండి శ్రీలంక వరకు నడుపుతున్న రామాయణ ఎక్స్ప్రెస్ గుంతకల్లు స్టాప్ ఉండాలని వినతి పత్రం అందజేసిన బిజెపి మహిళ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు

షిరిడి సాయి సప్తాహం ప్రారంభం

స్వయంభు గుండు మల్లన్న ఆధ్వర్యంలో ఎడ్ల బండ్ల పోటీలు

వైభవంగా శ్రీ రామలింగేశ్వర స్వామి జాతర ఉత్సవాలు
