కళ్యాణ వేదిక మార్పుపై పునరాలోచించాలి
ధర్మపురి మార్చి 03:
దక్షిణ కాశీగా పేరుపొందిన పవిత్రమైన పుణ్య క్షేత్రం ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణ వేదిక మార్పుపై పునరాలోచించాలని భాజపా నేతలు కోరారు. సోమవారం భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షుడు గాజు భాస్కర్ ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం సూపరింటెండెంట్ కు ఎందుకు సంబంధించిన వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షులు గాజు భాస్కర్ గారు మాట్లాడుతూ ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించే ప్రతిష్టాత్మకమైన స్వామి వార్ల కళ్యాణం అత్యంత వైభవమైనదిని,
దీనిని భక్తులు చాలా పవిత్రంగా భావిస్తారన్నారు. ఈ పవిత్ర కార్యక్రమాన్ని చెత్త చెదరానికి డoపు గా ఉపయోగించే స్థలం లో నిర్వహించ నిర్ణయించడం
చాలా బాధాకరమన్నారు.
అనేక రకాల చెత్తా చెదారాలతో నిండిన డంప్ యార్డ్...అందులో అనేక రకాల డైపర్లు , సానిటరీ ఫ్యాడ్స్ , పశువుల కళేబరాలు, ఎముకలు ఇలాంటివన్నీ ఆ డంప్ యార్డ్ ప్రదేశంలో ఉంటాయని, ప్రతిష్టాత్మకంగా భగవంతుని కళ్యాణ కార్యక్రమం చేస్తున్న సందర్భంలో స్థలం మంచి చెడులను విచారించాల్సిందిగా కోరుతూ, దానివల్ల భక్తుల, పట్టణ ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని ఈ ఆలోచనను పునరాలోచన చేయాలని డిమాండ్ చేస్తూ వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు గాజు భాస్కర్, బిజెపి జిల్లా కార్యదర్శి పిల్లి శ్రీనివాస్, అసెంబ్లీ కో- కన్వీనర్ బండారి లక్ష్మణ్, ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి ఆకుల శ్రీనివాస్, తిరుమందాస్ సత్యనారాయణ, మండలోజి సూరజ్, అప్ప మల్లేష్, అనంతదాసు నవీన్, వెలగందుల ప్రణీత్, సంగి రాజేష్, కాశెట్టి మహేష్, కాశెట్టి హరీష్, సంగి రాజేష్, అప్పం శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
సన్న బియ్యం పేదల పాలిట వరం ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఛలో ఢిల్లీ ధర్నాకు తరలిన జగిత్యాల జిల్లా బిసి నాయకులు
.jpeg)
రామలింగేశ్వర ఆలయం ఆధ్వర్యంలో ఎడ్లబండ్ల పోటీలు

సేవ చేయాలనే సీనియర్ సిటిజన్స్ సంకల్పం గ్రేట్ *మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని

జీవితంపై విరెక్తి చెంది ఉరి వేసుకుని ఆత్మహత్య

72 సం, వృద్ధురాలు ఆత్మహత్య.

పూట గడవని దుస్థితి...మందులు కొనలేని పేదరికం *అండగా నిలిచిన ఎన్జీవో సంస్థ

శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా కొనసాగుతున్న హనుమాన్ చాలీసా పారాయణం

అయోధ్య నుండి శ్రీలంక వరకు నడుపుతున్న రామాయణ ఎక్స్ప్రెస్ గుంతకల్లు స్టాప్ ఉండాలని వినతి పత్రం అందజేసిన బిజెపి మహిళ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు

షిరిడి సాయి సప్తాహం ప్రారంభం

స్వయంభు గుండు మల్లన్న ఆధ్వర్యంలో ఎడ్ల బండ్ల పోటీలు

వైభవంగా శ్రీ రామలింగేశ్వర స్వామి జాతర ఉత్సవాలు
