ఏబీహెచ్ఏ కార్డుల కోసం సీనియర్ సిటీజెన్ల పడిగాపులు.
ఆరోగ్య సలహాలు పుస్తకంను ఆవిష్కరించిన హరి ఆశోక్ కుమార్.
జగిత్యాల మార్చి 01:
70 ఏళ్ళు నిండిన సీనియర్లు సిటీజెన్ల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎబి హెచ్ ఏ (ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ అనారోగ్య యోజన )పథకం కార్డుల జారీ కోసం సీనియర్ సిటీజేన్లు పడిగాపులు కాస్తున్నారని తెలంగాణ ఆల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి,జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు.శనివారం సంఘం కార్యాలయంలో పలువురు 70 ఏళ్ళు దాటిన సీనియర్ సిటీజేన్స్ విలేకరులతో మాట్లాడారు.
ఏ.బి.హెచ్.ఏ.కార్డులు గత నెల రోజులు గా ఆన్ లైన్ లో డౌన్ లోడ్ కావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు .ఈ సందర్భంగా జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో ముద్రించిన సీనియర్ సిటీజేన్లకు ఆరోగ్య సలహాలు అనే పుస్తకాన్ని సీనియర్ సిటీజేన్స్ రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా హరి ఆశోక్ కుమార్ మాట్లాడుతూ దేశంలో 70 ఏళ్ల పై బడిన సీనియర్ సిటీజేన్స్ కోసం ప్రధాన మంత్రి మోదీ ప్రవేశపెట్టిన కేంద్ర ఆరోగ్య భీమా పథకం లో 37 లక్షల మంది అర్హులని,రాష్ట్రంలో 14 వేలకు పైగా నమోదు చేసుకున్నారని వివరించారు.కాగా రాష్ట్రంలో రాజీవ్ ఆరోగ్యశ్రీ కి ఏ.బి.హెచ్.ఏ.అనుసంధానం చేస్తేనే కార్డులు డౌన్ లోడ్ అయ్యి వైద్య సేవలు అందుతాయన్నారు.ఇప్పటికే పొరుగు తెలుగు రాష్ట్రమైన ఆంద్రప్రదేశ్ లో ఎన్టీఆర్ వైద్య సేవా పథకంతో కేంద్ర పథకాన్ని అనుసంధానం చేసి కార్డులను అందిస్తే వైద్య సేవలు అందుతున్నాయన్నారు.దీనిపై రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓ శివశంకర్ ను తమ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.నర్సింహారావు ఆధ్వర్యంలో కలిసి కోరగా సాంకేతిక సమస్యలను తొలగించి త్వరలోనే కేంద్ర పథకం కార్డులు డౌన్ లోడ్ అయ్యే విధంగా చూస్తామని హామీ ఇచ్చారని తెలిపారు.
ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గౌరిశెట్టి విశ్వనాథం,కోశాధికారి వెల్ముల ప్రకాష్ రావు,ఉపాధ్యక్షులు బొల్లంవిజయ్,పి.సి.హన్మంత్ రెడ్డి, ఎం.డి.యాకూబ్, ఆర్గనైజింగ్ కార్యదర్శులు పి.ఆశోక్ రావు, కె.సత్యనారాయణ,సంయుక్త కార్యదర్శులు దిండిగాల విఠల్,రాజ్ గోపాల్ చారి,కరుణ, జగిత్యాల డివిజన్ అధ్యక్షుడు బి.రాజేశ్వర్,కోరుట్ల అధ్యక్షుడు పబ్బా శివానందం,మెట్ పల్లి అధ్యక్షుడు ఒజ్జల బుచ్చిరెడ్డి,ధర్మపురి అధ్యక్షుడు కండ్లే గంగాధర్,మల్యాల అధ్యక్షుడు దేవా రెడ్డి,దేవేందర్ రావు,నారాయణ,సంజీవ రావు,గౌరీశంకర్,తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
సన్న బియ్యం పేదల పాలిట వరం ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఛలో ఢిల్లీ ధర్నాకు తరలిన జగిత్యాల జిల్లా బిసి నాయకులు
.jpeg)
రామలింగేశ్వర ఆలయం ఆధ్వర్యంలో ఎడ్లబండ్ల పోటీలు

సేవ చేయాలనే సీనియర్ సిటిజన్స్ సంకల్పం గ్రేట్ *మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని

జీవితంపై విరెక్తి చెంది ఉరి వేసుకుని ఆత్మహత్య

72 సం, వృద్ధురాలు ఆత్మహత్య.

పూట గడవని దుస్థితి...మందులు కొనలేని పేదరికం *అండగా నిలిచిన ఎన్జీవో సంస్థ

శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా కొనసాగుతున్న హనుమాన్ చాలీసా పారాయణం

అయోధ్య నుండి శ్రీలంక వరకు నడుపుతున్న రామాయణ ఎక్స్ప్రెస్ గుంతకల్లు స్టాప్ ఉండాలని వినతి పత్రం అందజేసిన బిజెపి మహిళ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు

షిరిడి సాయి సప్తాహం ప్రారంభం

స్వయంభు గుండు మల్లన్న ఆధ్వర్యంలో ఎడ్ల బండ్ల పోటీలు

వైభవంగా శ్రీ రామలింగేశ్వర స్వామి జాతర ఉత్సవాలు
