చాచా నెహ్రు నగర్ లో ఫ్రీ మెడికల్ క్యాంపు
సికింద్రాబాద్ ఫిబ్రవరి 28 (ప్రజామంటలు):
బన్సీలాల్ పేట్ డివిజన్ లోని చాచా నెహ్రూ నగర్ కమ్యూనిటీ హాల్ లో శుక్రవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. జనహిత సేవా ట్రస్ట్, కిమ్స్ ఫౌండేషన్ అండ్ రీసర్చ్ సెంటర్, రెయిన్ బో హోమ్స్, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కమ్యూనిటీ కేర్ అండ్ లర్నింగ్ సెంటర్ ల సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన శిబిరాన్ని కార్పోరేటర్ కె. హేమలత ప్రారంభించారు.పేద ప్రజలు నివసిస్తున్న బస్తీలలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. కిమ్స్ ఆస్పత్రి నుండి వచ్చిన జనరల్ ఫిజీషియన్, ఆర్థోపెడిక్, గైనకాలజీ, పీడియాట్రిక్స్ వైద్యులు 170 మందికి బీపీ, షుగర్ పరీక్షలను నిర్వహించి, వైద్య సలహాలు, మందులను ఉచితంగా అందజేశారు. మోకాలు, నడుము నొప్పి ఉన్నవారికి ఫీజియోథెరపిస్ట్ శ్రీనివాస్ ఎక్సర్సైజ్ లను చూపించారు. భారత్ వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పరీక్షించి, రక్తహీనత ఉన్న వారికి ఐరన్ టాబ్లెట్లను అందజేశారు. రెయిన్ బో ఫౌండేషన్ ఇండియా, సీనియర్ మేనేజర్ శ్రీలత, సిటీ డెస్క్ కోఆర్డినేటర్ క్రాంతి కిరణ్, ప్రాజెక్టు ఇంచార్జ్ సుజాత, సిబిసి కోఆర్డినేటర్ సంధ్యారాణి, టీచర్ వెంకటలక్ష్మి, కిమ్స్ ఆస్పత్రి కోఆర్డినేటర్ విక్రం, జనహిత సేవా ట్రస్ట్ ప్రతినిధి వెంకట నారాయణ, కోఆర్డినేటర్ నర్సింగ్ రావు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
సన్న బియ్యం పేదల పాలిట వరం ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఛలో ఢిల్లీ ధర్నాకు తరలిన జగిత్యాల జిల్లా బిసి నాయకులు
.jpeg)
రామలింగేశ్వర ఆలయం ఆధ్వర్యంలో ఎడ్లబండ్ల పోటీలు

సేవ చేయాలనే సీనియర్ సిటిజన్స్ సంకల్పం గ్రేట్ *మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని

జీవితంపై విరెక్తి చెంది ఉరి వేసుకుని ఆత్మహత్య

72 సం, వృద్ధురాలు ఆత్మహత్య.

పూట గడవని దుస్థితి...మందులు కొనలేని పేదరికం *అండగా నిలిచిన ఎన్జీవో సంస్థ

శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా కొనసాగుతున్న హనుమాన్ చాలీసా పారాయణం

అయోధ్య నుండి శ్రీలంక వరకు నడుపుతున్న రామాయణ ఎక్స్ప్రెస్ గుంతకల్లు స్టాప్ ఉండాలని వినతి పత్రం అందజేసిన బిజెపి మహిళ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు

షిరిడి సాయి సప్తాహం ప్రారంభం

స్వయంభు గుండు మల్లన్న ఆధ్వర్యంలో ఎడ్ల బండ్ల పోటీలు

వైభవంగా శ్రీ రామలింగేశ్వర స్వామి జాతర ఉత్సవాలు
