బడ్జెట్ లో తెలంగాణాకు చోటు ఉండదా? తెలంగాణా ప్రాంతానికి విలువ లేదా?? - మాజీ జెడ్పి చైర్ పర్సన్ దావ వసంత సురేష్.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల ఫిబ్రవరి 2( ప్రజా మంటలు ) :
తెలంగాణ ప్రాంతానికి బడ్జెట్లో చోటు ఉండదా తెలంగాణ ప్రాంతానికి ప్రయోజనానికి విలువ లేదా అని మాజీ జెడ్పి చైర్ పర్సన్ దావ వసంత అన్నారు.
రూరల్ మండలం తిమ్మాపూర్ కండ్ల పెళ్లి హైదరాపల్లె గ్రామాలలో గ్రామ సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొన్న జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ...
- బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి చోటు లేదా? తెలంగాణ ప్రాంత ప్రయోజనాలకు విలువ లేదా?
- ఇది కేంద్ర బడ్జెట్ లా లేదు, కేవలం మూడు, నాలుగు రాష్ట్రాల బడ్జెట్ లాగా ఉంది.
- తెలంగాణ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు, 8 మంది ఎంపీలు ఉండి తెలంగాణ రాష్ట్రానికి ఏం సాధించినట్లు..
- తెలంగాణతో తమకు బంధం లేదని బడ్జెట్ ద్వారా మరోసారి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిరూపించింది.
- తెలంగాణ నుంచి రెండు జాతీయ పార్టీలకు చెరో ఎనిమిది మంది ఎంపీలను గెలిపించి పార్లమెంట్‌కు పంపిస్తే ఆ 16 మంది కలిసి కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు తెచ్చింది అక్షరాల గుండు సున్నా.
- రెండు జాతీయ పార్టీలు బిజెపి,కాంగ్రెస్ తెలంగాణ ప్రయోజనాలు కాపాడటంలో దారుణంగా ఫెయిల్ అయ్యాయి.
- కెసీఆర్ ని ఓడిస్తే నష్టపోయేది భారాసనా?లేక తెలంగాణానా ఒకసారి ప్రజలు ఆలోచించాలి.
కెసిఆర్ నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే విధంగా కార్యకర్తలు పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని అన్నారు.
బిజెపి కాంగ్రెస్ మోసపూరిత హామీలపై ప్రశ్నించే గొంతుగా ప్రజల పక్షాన పోరాడాలని అన్నారు.
అనంతరం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన పాలెపు మారుతి కి కాలు విరగగా వారి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకోవడం జరిగింది.
ఈ కార్యక్రమంలో రూరల్ మండలం అధ్యక్షుడు ఆనందరావు సీనియర్ నాయకులు గంగారెడ్డి,రాజన్న ,అంజయ్య,కొల గంగా రావు,ప్రభాకర్ రావు, అది రెడ్డి,సత్యం రావు ,రాములు,గంగారెడ్డి, మహిళా లు దుబవ్వ,కవిత పద్మ,మమత,పుష్ప యూత్ నాయకులు హరీష్ రాజేష్ సాయి మహేందర్ అజయ్,నరేష్ రవి మరియు బిఆర్ఎస్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.