చెరువుల రక్షణకు హైడ్రా కు టీడీఎఫ్ సూచనలు
చెరువుల రక్షణకు హైడ్రా కు టీడీఎఫ్ సూచనలు
సికింద్రాబాద్, ఫిబ్రవరి 02 ( ప్రజామంటలు):
తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం( టీడీఎఫ్) ఆధ్వర్యంలో హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ కు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఇండియా అధ్యక్షులు మట్ట రాజేశ్వర్ రెడ్డి లు చెరువుల రక్షణకు సూచనలతో కూడిన రిపోర్టును అందచేశారు. డాక్టర్ బిక్షం గుజ్జ, డా.కే.శివకుమార్, శ్రవన్ కుమార్ ల సహాకారంతో తెలంగాణ ట్రెడిషనల్ వాటర్ హెరిటేజ్ ఏ ఫ్రేమ్ వర్క్ ఫర్ రివైనింగ్ టైమ్స్ చెరువులు, కుంటలు, వాటర్ బాటిల్స్ కు సంబందించిన రిపోర్ట్ ను హైడ్రా కమిషనర్ కు అందచేసినట్లు టీడీఎప్ ప్రతినిధులు తెలిపారు. ఈ రిపోర్ట్ ను తెలంగాణ సమాజానికి పుస్తక రూపంలో అందించినట్లు టీడీఎఫ్ అమెరికా మాజీ ప్రెసిడెంట్ గాదె గోపాల్ రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ర్టానికి సంబందించిన 46 వేల5వందల నీటి వనరుల గురించి ఈ రిపోర్ట్ లో పొందుపరిచామని తెలిపారు. ముఖ్యంగా హైదరాబాద్ కలుపుకొని నాలుగు జిల్లాలకు సంబందించిన 1042 చెరువులకు సంబందించిన డీటెయిల్ రిపోర్ట్ ను కమిషనర్ కు అందించామన్నారు. స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ...ఈ రిపోర్ట్ పై సమీక్ష కు సంబందించి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ వచ్చే వారం నిష్ణాతులైన రిటైర్డ్ ఇంజనీయర్స్, తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరం సభ్యులతో కలసి ముఖ్య సమావేశం నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో టీడీఎఫ్ ఇండియా ప్రెసిడెంట్ మట్టా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్సీ కోదండరాం, డాక్టర్ కే.శివకుమార్, టీడీఎఫ్ ఇండియా మాజీ చైర్మన్ బద్దం రణధీర్ పాల్గొన్నారు.