వేధింపులు తాళలేక ఆత్మహత్య
వేధింపులు తాళలేక ఆత్మహత్య
జగిత్యాల ఫిబ్రవరి 01:
జగిత్యాల మార్కండేయ నగర్ వీధిలో పద్మశాలి అంగడి బట్టల వర్తక కార్యవర్గ సభ్యుల వేధింపులు తాళలేక దేవందర్
అనే బట్టల వ్యాపారి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది.
అంగడి బట్టల వర్తక సంఘ కార్యవర్గ సభ్యుల వేధింపులు భరించలేక గుండేటి దేవేందర్ అనే బట్టల వ్యాపారి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేసారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
దేవేందర్ చిట్టి డబ్బులు కడుతాలేదంటూ కార్యవర్గ సభ్యులు వాట్సప్ గ్రూప్ లలో పెట్టి వైరల్ చేసిన అంగడి బట్టల వర్తక సంఘ కార్యవర్గ సభ్యుల మేసేజ్ లు చూడలేక, ఆవేదనతో ఉరివేసుకొన్నట్లు ఆరోపణలు వచ్చాయి.
గత కొన్ని రోజులుగా చిట్టి డబ్భులు కట్టలేదని దేవేందర్ ఇంటికెళ్లి వేదించడం వల్లనే ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
మనస్తాపం చెంది బాత్రూమ్ లో నైలాన్ తాడుతో ఉరివేసుకొని ఆత్మహత్య
చేసుకున్నారని కుటుంబ సభ్యుల ఆరోపణ