నిరుపేద బాలిక వైద్యానికి 1.31 లక్షలు సాయం.
సామాజిక మిత్రుల ఔదార్యం
నిరుపేద బాలిక వైద్యానికి 1.31 లక్షలు సాయం.
(రామ కిష్టయ్య సంగన భట్ల)
ధర్మపురి జనవరి 31:
ఒకవైపు భర్త మరణించడం మరో వైపు కూతురుకు క్యాన్సర్ వ్యాధి సోకగా వైద్యానికి ఇబ్బంది పడుతున్న నిరుపేద మహిళా కుటుంబానికి ఫేస్ బుక్ మిత్రులు రూ . 1.31 లక్షలు సాయం అందించి తమ ఔదార్యం చాటుకున్నారు.
మహారాష్ట్ర ,గడ్చిరోలి జిల్లా, ఆలపల్లి గ్రామానికి చెందిన వాడకొండవార్ రాజు ,సరిత దంపతుల కూతురు నందిని (11) 7 నెలల నుండి బ్లడ్ క్యాన్సర్ వ్యాధితో ఇబ్బంది పడుతున్నది.
రాజు 4 ఏళ్ల క్రితం మరణించగా భార్య సరిత కూలి పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంది. కుటుంబ పోషణ కోసమే ఇబ్బందులు పడుతున్న సరితకు కూతురు వైద్యం మరింత భారంగా మారింది.
నందిని సమస్యను సామాజిక మిత్రుల ద్వారా తెలుసుకున్న ధర్మపురికి చెందిన సామాజిక సేవకుడు రేణికుంట రమేష్ స్పందించి బాలిక వైద్య ఖర్చులకు సహాయం అందించాలని జనవరి 3న ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. దాంతో స్పందించిన తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎన్నారైలు బాలిక తల్లి సరిత బ్యాంకు ఖాతాకు రూ. 1.31 లక్షల విరాళాలు పంపించారు.
దాతలు అందించిన విరాళాలతో బాలికకు వైద్యం చేయిస్తున్నారు.