గాంధీలో రోడ్డు భద్రత మాసోత్సవాల ర్యాలీ..
గాంధీలో రోడ్డు భద్రత మాసోత్సవాల ర్యాలీ..
సికింద్రాబాద్, జనవరి 22 (ప్రజామంటలు):
జాతీయ రహదారి భద్రత మాస ఉత్సవాలను పురస్కరించుకొని గాంధీ వైద్య కళాశాల విద్యార్థులు బుధవారం ప్రజలకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. కళాశాల ఎస్ పి ఎం విభాగాధిపతి ప్రొఫెసర్ కోటేశ్వరమ్మ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఇందిర ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ... ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత పట్ల అవగాహన కలిగి ఉండాలని ట్రాఫిక్ నిబంధనలను ప్రతి పౌరుడు విధిగా పాటించాలన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం మూలంగానే ప్రతిరోజు ఎంతోమంది రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారని ఆమె అన్నారు. రోడ్డు భద్రతపై అవగాహన ర్యాలీ చేపట్టిన వైద్య విద్యార్థులను ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ అభినందించారు. ఈ ర్యాలీలో అసోసియేట్ ప్రొఫెసర్ డా. వేణు అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ ప్రఫుల్, డాక్టర్ రజిత, లెక్చరర్ నాగరాజు స్టాటిస్టికల్ ఆఫీసర్ రాజకుమార్, ఎంపీహెచ్ఈ ఓ వేణుగోపాల్ గౌడ్ వైద్య విద్యార్థులు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.