మల్లన్నపేట పిఎ సిఎస్ ఏర్పాటు చేయాలి ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ కు వినతి
మల్లన్నపేట పిఎ సిఎస్ ఏర్పాటు చేయాలి
గొల్లపల్లి జనవరి 21 (ప్రజా మంటలు):
గొల్లపెల్లి మండలంలోని మల్లన్నపేట గ్రామంలో పిఎసిఎస్ సోసైటీని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు మంగళవారం రోజున ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కలిసి వినతి పత్రాన్ని అందజేశారు.మల్లన్న పేట గ్రామం లో సొసైటీ ని ఏర్పాటు చేయడం వలన చుట్టూ ప్రక్కల గ్రామలైన
వెంగలాపూర్,శంకర్ రావు పేట్, ఇస్రాజ్ పల్లి, రాపల్లి, నందిపల్లి,ఇబ్రహీంనగర్, బి.బి.రాజ్ పల్లి గ్రామాల అన్నిటికి మద్యలో రెండు కిలోమీటర్ల దూరం పరిదిలో ఉండడం వలన ఈ గ్రామాల రైతులకు లబ్ధి చేకూరుతుందని కావున మలన్న పేట్ గ్రామం లో నూతన సహకార సంఘం ఏర్పాటు చేయగలరని విప్పు కు వివరించారు. ఈ కార్యక్రమంలో గొల్లపల్లి ఏఎంసీ చైర్మన్ భీమా సంతోష్, మాజీ ఉప సర్పంచ్ బేరా కిషోర్, గ్రామస్తులు దుర్గ చంద్రయ్య, లంబ లస్మయ్య, కళ్లెం బాలింగు, లక్కం మల్లయ్య,కొడుకల గంగరాజాం, కళ్లెం రాజన్న, మద్దెల గోవర్ధన్ పాల్గొన్నారు.