#Draft: Add Your Title

On
#Draft: Add Your Title

ధర్మపురిలో వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు

 (రామ కిష్టయ్య సంగన భట్ల 9440595494)

 ప్రాచీన పుణ్య క్షేత్రమైన ధర్మపురి లోని శ్రీక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో, శుక్ర వారం వైకుంఠ (ముక్కోటి ఏకాదశి) వేడుకలు కన్నుల పండువగా, పైభవోపేతంగా జరిగాయి. ఉదయాత్ పూర్వం వేద మంత్రోచ్ఛారణల మధ్య, అర్చకులు పవిత్ర జలాలను కొనితెచ్చి లక్ష్మీ సమేత శ్రీ యోగానంద,శ్రీ ఉగ్ర నారసింహ, శ్రీ వేంకటేశ్వర స్వాముల మూల విరాట్టులను సాంప్రదాయ విధి విధాన రీతిలో, మహాక్షీరా భిషేకాది ప్రత్యేక పర్వదిన పూజలు నిర్వహించారు. అనంతరం సర్వాంగ సుందరంగా అలంకృతులైన స్థానిక ఇలవేల్పులను దేవస్థాన ప్రాంగణంలో విద్యుద్దీపికలలో, వివిధ పుష్ప మాలికలతో, శోభాయమానంగా తీర్చి దిద్దిన రంగవల్లులతో, ఆకర్షణీయంగా అలంకరించిన ప్రత్యేక వేదికపై అసీసుల గావించారు.

ధనుర్మాస ప్రత్యేకతలో సప్త హారతులు, షోడశోపచార పూజలు, వేద, శాస్త్ర పురాణ, సంగీత, నృత్య, వాద్యాది అవధారయాలతో ఆర్చనలు, భక్తుల గోత్ర నామాదులతో పూజలు నిర్వహించగా, భక్తజనులు భక్తి శ్రద్ధలతో కన్నులారా గాంచి తరిం చారు. అనంతరం జయ జయ ధ్వనాల మధ్య ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, పెద్దపెల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ సమక్షంలో, ముఖ్య అర్చకులు నంబి శ్రీనివాసా చార్య వైకుంఠ (ఉత్తర) ద్వారానికి పూజ చేసి, నారికేళములను సమర్పించి, వైకుంఠ ద్వారం తెరవగా,  ద్వారం ద్వారా  ప్రవేశించిన భక్తులు పరమానంద భరితులై తనివి తీరా దర్శనం చేసుకున్నారు. 

 దేవస్థానం ఈ ఓ శ్రీనివాస్ పర్య వేక్షణలో, దేవస్థాన అర్చకుల బృందం ఆధ్వర్యంలో, సిబ్బంది సహకారంతో, బొజ్జా సంపత్ కుమార్, రాజ గోపాల్, పాలేపు ప్రవీణ్ శర్మ ,  క్షేత్ర పండితుల మార్గదర్శకత్వంలో ఘనంగా కార్య క్రమాలను నిర్వహించారు. 

రాష్ట్ర ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, పెద్దపెల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, జిల్లా ఎస్పీ, డీఎస్పీ, ఆర్డీఓ మధుసూదన్, డిసిఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, ధర్మపురి మున్సిపల్ చైర్ పర్సన్ సత్తమ్మ, వైస్ చైర్మన్ రామయ్య, మార్కెట్ చైర్ పర్సన్ లావణ్య, వైస్ చైర్మన్ నర్సింలు 
తదితరులు ప్రత్యేక పూజాదులలో పాల్గొన్నారు. అలాగే బచ్చు రాము గుప్తా సహకారంతో 
నూతర సంవత్సర క్యాలండర్ ను విప్ లక్ష్మణ్ కుమార్, ఎంపీ గడ్డం వంశీకృష్ణ జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ ఇతర ప్రముఖుల సమక్షంలో ఆవిష్కరించారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత తదితరులు దైవ దర్శనాలు చేసుకున్నారు.

భారీ ఏర్పాట్లు 

వైకుంఠ ఏకాదశి మహోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక శ్రద్ధతో, శ్రమ కోర్చి ఈ ఏడు భారీ ఏర్పాట్లు గావించారు. ప్రధాన రహదారి నుండి దేవస్థానం లోపలి వరకూ క్యూలైన్లు ఏర్పరిచారు. దేవస్థాన ప్రాంగణంలో విద్యుద్దీమాలతో, రంగవల్లులతో, పెద్దఎత్తున పందిళ్ళను, ప్రత్యేక పుష్ప వేదికను ఏర్పాటు చేశారు. దేవస్థానం బయట రోడుపై వివిధ ఆకృతులలో రంగులద్దారు. స్వాములను ఆసీనుల గావించిన ప్రదేశాన శాశ్వత ఇనుప షెడ్లను అందంగా తీర్చి దిద్దారు. ధర్మపురి సిఐ రాం నర్సింహా రెడ్డి రూప కల్పన మేరకు డివిజన్ లోని పలువురు ఎస్ఐలు, ఎఎస్ఐలు/హెడ్ కానిస్టే బుల్స్, సివిల్ కానిస్టేబుల్స్, హోంగార్డులు, మహిళా హోంగార్డులు, డిస్ట్రిక్ట్ గార్డులు, ప్రైవేటు సెక్యూటిరీ గార్డులు దేవస్థానంలో కట్టుదిట్టమైన బందోబస్తుని ర్వహించారు. ఎస్.ఆర్.ఆర్. కేబుల్ నెట్ వర్క్ ద్వారా గావించిన ప్రత్యక్ష ప్రసారం స్థానికంగా వీక్షించారు. బాచంపెల్లి సంతోష్ కుమార్ 
వ్యాఖ్యానాలు ఆకట్టుకున్నాయి. 
గుండి జగదీశ్వర్, బృందం భక్తి సంగీత విభావరి అలరించింది. కోలాట బృందం నృత్యాలు, విన్యాసాలు, ఆటపాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 

 వైకుంఠ ద్వార దర్శనంలో జాప్యం 

వైకుంఠ ఏకాదశి సందర్భంగా, ఉత్సవాలలో ప్రధానమైన ఉత్తర ద్వార దర్శన కార్యక్రమ నిర్వహణ విషయంలో, పెరిగిన రద్దీ కారణంగా, దైవ సేవలు ద్వారం గుండా వేంచేపు చేయడంలో కాలా యాపన జరిగింది. వాస్తవానికి కారణాలేవైనా, ప్రత్యేక వేదిక వద్ద పూజలు 5గంటల తర్వాత ప్రారంభం చేశారు. IMG-20250110-WA0552
 ధనుర్మాస శుక్లపక్ష ఏకాదశి ప్రభాత సమయంలో, వైకుంఠంలో శ్రీమహావిష్ణువును దర్శించి తరించిన నేపథ్యంలో, ఇంద్రాది దేవతలు జరుపు కుంటున్న ఈ ఉత్సవ వేడుకలలో ప్రాతః కాలంలో బ్రాహ్మీముహూర్తంలో పూ జలొనర్చి, సూర్యోదయానికి ముందే వైకుంఠ (ఉత్తర) ద్వారం తెరవబడి, ఆ ద్వారం గుండా వేంచేసే స్వాముల దర్శనాలు చేసుకోవడం ప్రధానం మరియు క్షేత్రంలో అనుసరణీయమైన సాంప్రదాయం కాగా, భక్తుల రద్దీ అధికమై, దర్శనాలకై బారులు తీరిన సందర్భంలో, ఉదయాత్పూ ర్వమే ఉత్తర ద్వారం తెరిచినా, స్వాముల సేవల వేంచేపు చాలా ఆలస్యమై ఉదయం
 8.30గంటల వరకు దైవ సేవలు పట్టణంలోకి వెళ్ళడం నిర్వహించారు. స్వాముల ఉత్సవ మూర్తుల సేవలను పట్టణ వీధుల గుండా ఊరేగించి, ఇసుక స్థంభం వద్ద పూజలు నిర్వహించాక, దేవస్థానానికి తిరిగి వచ్చారు. 
ముక్కోటి వేదిక వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి, వైకుంఠ ద్వారం నుండి భక్తుల దర్శనాలను కొనసాగించారు.

Tags

More News...

Local News 

కొత్తకొండ కోరమీసాల వీరభద్రస్వామి కళ్యాణం కమనీయం

కొత్తకొండ కోరమీసాల వీరభద్రస్వామి కళ్యాణం కమనీయం పట్టు వస్త్రాలు సమర్పించిన ఆలయ చైర్మన్ కొమురవెల్లి చంద్రశేఖర్ గుప్త దంపతులు
Read More...
National  State News 

ఘనంగా ప్రవాసి భారతీయ దినోత్సవం వేడుకలో పాల్గొన్న జగిత్యాల జిల్లా వాసులు

ఘనంగా ప్రవాసి భారతీయ దినోత్సవం వేడుకలో పాల్గొన్న జగిత్యాల జిల్లా వాసులు ఘనంగా ప్రవాసి భారతీయ దినోత్సవం వేడుకలో పాల్గొన్న జగిత్యాల జిల్లా వాసులు భువనేశ్వర్ జనవరి 10: ప్రవాసీ భారతీయ దినోత్సవ వేడుకలు ఒరిస్సా రాజధాని భువనేశ్వర్ లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించగా, శుక్రవారం ముగింపు కార్యక్రమంలో  భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము పాల్గొన్నారు. బిజెపి ఏపీ ఇంచార్జ్ డొక్కా...
Read More...
Local News  State News 

రెండు బైక్ లు ఎదురెదురుగా డీ కొని ముగ్గురి మృతి

రెండు బైక్ లు ఎదురెదురుగా డీ కొని ముగ్గురి మృతి రెండు బైక్ లు ఎదురెదురుగా డీ కొని ముగ్గురి మృతి గొల్లపల్లి జనవరి 10 (ప్రజా మంటలు): జగిత్యాల ధర్మపురి ప్రధాన రహదారిపై తక్కలపల్లి అనంతారం మధ్య రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొని ముగ్గురు మృతి  చెందారు. ఈ ప్రమాదంలో జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ కు చెందిన భూత గడ్డ అరవింద్, బత్తుల సాయి...
Read More...
Local News 

ఆలయ ఆవరణ లో ఉచిత మెడికల్ క్యాంప్​  * 350 మందికి వైద్య పరీక్షలు

ఆలయ ఆవరణ లో ఉచిత మెడికల్ క్యాంప్​  * 350 మందికి వైద్య పరీక్షలు ఆలయ ఆవరణ లో ఉచిత మెడికల్ క్యాంప్​  * 350 మందికి వైద్య పరీక్షలు సికింద్రాబాద్​, జనవరి 10 ( ప్రజామంటలు): సికింద్రాబాద్​ సీతాఫల్‌మండి డివిజన్‌ శ్రీనివాసనగర్‌ శ్రీగిరి ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో  కేఎం క్లినిక్‌ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ఉచిత వైద్య శిభిరానికి విశేష స్పందన లభించింది. కేఎం క్లినిక్‌ నిర్వాహకుడు, వాస్కులర్‌...
Read More...
Local News 

ధర్మపురి స్వామివారిని దర్శించుకున్న కొప్పుల 

ధర్మపురి స్వామివారిని దర్శించుకున్న కొప్పుల  ధర్మపురి స్వామివారిని దర్శించుకున్న కొప్పుల  ధర్మపురి జనవరి 10: ముక్కోటి ఏకాదశి సందర్భంగా ధర్మపురి శ్రీ లక్ష్మి నరసింహ ఆలయం లో లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకుని  మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట జిల్లా తొలి జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ , డిసిఎంఎస్...
Read More...
Local News 

మహిళా ఉద్యోగినులకు సంక్రాంతి పండగ ముగ్గుల పోటీలు

మహిళా ఉద్యోగినులకు సంక్రాంతి పండగ ముగ్గుల పోటీలు మహిళా ఉద్యోగినులకు సంక్రాంతి పండగ ముగ్గుల పోటీలు    జగిత్యాల జనవరి 10: మహిళ,అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ అద్వర్యం లో ఈ జగిత్యాల జిల్లా లోని సమీకృత కార్యాలయాల సమూహం వద్ద ప్రభుత్వ మహిళా ఉద్యోగినులకు సంక్రాంతి పండగను పురస్కరించుకొని ముగ్గుల పోటీలు నిర్వహించారు.కార్యక్రమంలో మహిళల ఉద్యోగినిలు ఎంతో ఉత్సాహంగా,సృజనాత్నకతతో మరియు సందేశం తో...
Read More...
Local News 

ముగ్గుల పోటీ విజేతలకు బహుమతులు పంపిణీ చేసిన జగిత్యాల నియోజకవర్గం బీజేపీ ఇంచార్జ్ బోగ శ్రావణి

ముగ్గుల పోటీ విజేతలకు బహుమతులు పంపిణీ చేసిన జగిత్యాల నియోజకవర్గం బీజేపీ ఇంచార్జ్ బోగ శ్రావణి ముగ్గుల పోటీ విజేతలకు బహుమతులు పంపిణీ చేసిన జగిత్యాల నియోజకవర్గం బీజేపీ ఇంచార్జ్ బోగ శ్రావణి జగిత్యాల జనవరి 10: పట్టణంలోని 8వ వార్డ్ గోత్రాల కాలనీలో సంక్రాంతి సందర్భంగా 8వ వార్డ్ బిజెపి నాయకులు మామిడాల కవిత రాజగోపాల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీ కార్యక్రమంలో పాల్గొని విజేతలకు  బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు...
Read More...

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి భీమదేవరపల్లి జనవరి 10 (ప్రజామంటలు) : రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన శుక్రవారం వేలేరు మండలంలోని ఇచ్చులపల్లె (కన్నారం) లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మిడిదొడ్డి స్వామి రాజు (48) హనుమకొండలో చదువుతున్న పిల్లలను సంక్రాంతి సెలవులకు తీసుకురావడానికి బైక్ పై మల్లారం గ్రామ శివారులో కొత్తకొండ నుండి అతివేగంగా వస్తున్న...
Read More...
State News 

వ్యవసాయ యోగ్యమైన భూములకు రైతు భరోసా చెల్లించాలి

వ్యవసాయ యోగ్యమైన భూములకు రైతు భరోసా చెల్లించాలి వ్యవసాయ యోగ్యమైన భూములకు రైతు భరోసా చెల్లించాలి కలెక్టర్ల  సమావేశంలో ముఖ్యమంత్రి   ఎ.రేవంత్ రెడ్డి హైదరాబాద్ జనవరి 10: వ్యవసాయ యోగ్యమైన భూములకు రైతు భరోసా చెల్లించాలనీ,వ్యవసాయానికి అక్కరకు రాని భూములకు మాత్రమే ఇవ్వకూడదనీ,అలాంటి భూములను గుర్తించి రైతు భరోసా నుంచి మినహాయించాలని కలెక్టర్ల  సమావేశంలో ముఖ్యమంత్రి   ఎ.రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రియల్ భూములు,...
Read More...
Local News  State News 

ఆదివాసీ ప్రాంతాలు, ఆదివాసీల సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు - ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ఆదివాసీ ప్రాంతాలు, ఆదివాసీల సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు - ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివాసీ ప్రాంతాలు, ఆదివాసీల సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు - ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ జనవరి 10: రాష్ట్రంలోని ఆదివాసీ ప్రాంతాలు, ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.  ఆదివాసీ సంఘాలు, ప్రజా ప్రతినిధులతో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి  ప్రత్యేకంగా...
Read More...
Local News 

విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి

విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి భీమదేవరపల్లి జనవరి 10 (ప్రజామంటలు) : మండలంలోని ముస్తఫాపూర్ గ్రామానికి చెందిన కనకం నాగయ్య (65) శుక్రవారం విద్యుత్‌ షాక్‌తో మృతిచెందాడు. పోలీసుల వివరాలు మేరకు నాగయ్య గత 2 సం.ల నుండి అదే గ్రామానికి చెందిన బొక్కల ఇంద్రసేనా రెడ్డి బావి వద్ద వ్యవసాయ పాలేరుగా పనిచేస్తున్నాడు. రోజు వారి పనిలో భాగంగా మొక్క...
Read More...
Local News  State News 

ప్రశాంతంగా ముగిసిన వైకుంఠ ఏకాదశి బందోబస్తు.  ధర్మపురి లో బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ  అశోక్ కుమార్

ప్రశాంతంగా ముగిసిన వైకుంఠ ఏకాదశి బందోబస్తు.  ధర్మపురి లో బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ  అశోక్ కుమార్ ప్రశాంతంగా ముగిసిన వైకుంఠ ఏకాదశి బందోబస్తు.  ధర్మపురి లో బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్ జగిత్యాల జనవరి 10: వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని  జిల్లా ఉన్న వివిధ పుణ్యక్షేత్రాలలో  ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా పోలీస్ శాఖ పరంగా కావాల్సిన భద్రతాపరమైన ఏర్పాట్లను చేసి  ప్రశాంతంగా నిర్వహించారని  జిల్లా ఎస్పీ...
Read More...