నూలు పోగుల బతుకు చిత్రం "కామ్ గార్ "
నూలు పోగుల బతుకు చిత్రం "కామ్ గార్ ".
- అల్లే రమేష్, జర్నలిస్టు, సిరిసిల్ల
కష్టాలను కలబోసుకుని నూలు పోగుల బతుకు చిత్రాల ఒకచోట పోగేసుకుని లక్ష్మణ్ కలబోసుకుంటున్న దృశ్యాలు అతని కవిత్వంలో ఆవిష్కృతం అవుతుంటాయి." రాత్ ఫైల్ దివాస్ పైల్ "కవిత సంకలనంలో సిరిసిల్ల నేత బతుకుల ముఖచిత్రాలను ఆవిష్కరించిన సిరిసిల్ల కార్మిక కవి ఆడెపు లక్ష్మణ్. కవిత్వం కొనసాగింపు క్రమంలోంచి వచ్చిందే "కామ్ గార్" కవిత్వ సంకలనం. 2007 నుంచి 2023 వరకు తాను సిరిసిల్ల నేత బతుకుల తండ్లాటను అక్షరాల్లో సవరించిన సందర్భాలను సిరిసిల్ల మానేరు రచయితల సంఘం పుస్తక రూపంలో తీసుకొచ్చింది.
స్వతహా మరమగ్గాల కార్మికుడైన లక్ష్మణ్ తన జీవితంలో ఎదురైన అనుభవా లను తన చుట్టూ ఉన్న కార్మికుల జీవితాల్లో కల్లోలాన్ని ప్రత్యక్ష చూసినవాడు. తన అనుభవాల నుంచి కార్మికుల జీవితాల్లోని అనేక కోణాలను దుఃఖ భరిత జీవితాలను కవిత్వంగా మలిచి అందించిన కవిత్వమే" కామ్ గార్". కవిత్వం నిండా పరుచుకున్న కార్మికుల జీవితాలు నిటారుగా నిలబడి కవిత్వమై సమాజాన్ని నిలదీసి ప్రశ్నిస్తున్నట్లే కనిపిస్తుంది. అవసరం తీరకుండానే అలా వచ్చి పోయే "పగరా" చిన్నచిన్న సంతోషాలను కూడా వాయిదా వేస్తూ సమస్యలు తీరకుండానే ...సంక్షోభాల ఊబిలో మర మగ్గాల కార్మికుల జీవితాల అస్తిత్వంపై దెబ్బ కొట్టి పోతే కన్నీటిని దాచుకున్న కండ్ల వెనుక భవిష్యత్ తరాలకు ఇచ్చి పోతున్న బాకీల చిట్టాలు జీవితాలు కవిత్వం నిండా మనతో కలబోసుకుంటాయి. వదిలోచ్చిన వలసల అనుభవాల మరోసారి లక్ష్మణ్ యాది చేస్తాడు. మాటల్లో చెప్పలేం దుఃఖం , కనిపిస్తున్న సంక్షోభాల వెనుక కరిగిపోయిన కార్మికుల జీవితాల తాలుకు ప్రశ్నలను మన ముందు ఉంచుతున్న కవిత్వం. కాలక్షేపం కోసం కాకుండా కార్మికుల జీవితాలను పట్టిచూపి కవిత్వం అందరూ ఓసారి తడిమి చూడాల్సిందే.. కవిత్వానికి ముందుమాట రాసిన మచ్చ ప్రభాకర్, 5 తరగతి వరకు చదువుకున్న తన సాహితి నేపథ్యం గురించి లక్ష్మణ్ చెప్పుకున్న మాట ప్రత్యేకంగా కందుకూరి రమేష్ బాబు అందరికోసం చెప్పిన మాట కవిత్వం వెనుక ఉన్న గుండె తడిని గుర్తు చేస్తాయి...
సంకలనంలోని ఒక కవిత.
భీవండీకి పోయి రావాలె
భీవండికి మళ్లీ
ఒకసారి పోయి రావాలె
కడుపునిండా తిండి పెట్టి
కుటుంబాన్ని సాకిన దేశం పోయి రావాలె
ఏ రాత్రో అపరాత్రో పోయిన
పొట్టకు పెట్టిన అమ్మ చల్లని చేయని
ఒకసారి తడిమి రావాలె
......
. ఎంతమంది బతికున్నారో
ఎంతమంది చీకటి పోగులు కలిసిపోయారో
మల్లొక్కసారి సంచాల కార్ఖానాలోకి పోవాలె
......
More News...
<%- node_title %>
<%- node_title %>
ఎస్ ఆర్ ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ మరియు సైన్స్ కళాశాల వృక్ష శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో బొటానికల్ టూర్.

పహల్గాం దాడిని నిరసిస్తూ సీసీ నగర్ లో ర్యాలీ

బ్రెయిన్ ట్యూమర్ పేషంట్లకు ఎండోస్కోపిక్ విధానం ఓ వరం

ఉగ్రవాద పాకిస్తాన్ కు తగిన బుద్ధి చెప్పాలి.

పహల్గాం దాడికి నిరసనగా ఆటోడ్రైవర్ల నిరసన

నూతన ఆర్ఓఆర్ చట్టంపై జిల్లా కేంద్రంలో అవగాహన కార్యక్రమం పాల్గొన్న ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్

అందరికోసం న్యాయ విజ్ఞాన సదస్సులు - సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వర్ రావు

క్రీడలతో మానసిక ఉల్లాసం తో పాటు శారీరిక ధారుఢ్యం మరియు స్నేహభావం పెంపొందుతుంది . జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్

వాస్తవాలను తెలుసుకోకుండా సోషల్ మీడియా పోస్టులను ఫార్వర్డ్ చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం జగిత్యాల డీఎస్పీ రఘు చందర్

రోడ్డు ప్రమాదంలో అబ్బాపూర్ డీలర్ మృతి

ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ

ప్రతి ఉద్యోగికి పదవి విరమణ తప్పనిసరి ఎమ్మెల్యే డా.సంజయ్
