సైబర్ నేరాలపై అందరూ అవగాహన పెంచుకోవాలి..!-కిరణ్ కుమార్,ఎస్ ఐ.
సైబర్ నేరాలపై అందరూ అవగాహన పెంచుకోవాలి..!-కిరణ్ కుమార్,ఎస్ ఐ.
జగిత్యాల నవంబర్ 19
పట్టణ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు సైబర్ క్రైమ్ ఫై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.మహిళా సాధికారిక విభాగం (WEC) పక్షాన ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి పోలీసు శాఖ ఆధ్వర్యంలో జగిత్యాల పట్టణ సబ్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ ముఖ్య వక్తగా విచ్చేసి, విద్యార్థులతో సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు.
ఆయన మాట్లాడుతూ, "రోజువారి జీవితంలో ఇంటర్నెట్ వినియోగము పెరగడంతో మొబైల్ ఫోన్లు, ఆన్లైన్ గేమ్లను ఆసరా చేసుకొని సైబర్ నేరగాళ్లు వివిధ సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని, మనం చెప్పే ఓటీపీల ద్వారా మన బ్యాంకులోని నగదును సొమ్ము చేసుకుంటున్నారని, అప్రమత్తంగా లేకపోతే మనం మోసానికి గురి అవుతారని తెలిపారు.
ఇంకా, డబ్బులు కూడా పోగొట్టుకున్న వాళ్ళం అవుతామని,ఇలాంటి ఏ సందర్భం అయినా మీ అనుభవంలోకి వచ్చినప్పుడు గాని లేదా మీకు తారసపడినప్పుడు తప్పకుండా వీటి పైన కూడా చర్యల కోసం పోలీసులను ఆశ్రయించవచ్చని తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం దీనికోసం ప్రత్యేకంగా 1930 అత్యవసర నెంబర్ ని ఏర్పాటు చేసిందని ఇందులో మనం వెంటనే రిపోర్ట్ చేసినట్లయితే మనం కోల్పోయే డబ్బుని తిరిగి రాబట్టుకోవచ్చని తెలియజేశారు".
కళాశాల ఉప ప్రధానాచార్యులు జి. చంద్రయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డా. N. వాసవి, డా. T. ప్రమోద్ కుమార్, డా. వి. వరప్రసాద్, సంగీత రాణి, రాంచంద్రం, జి. నీరజ, జి. సుజాత, యం.ఎ. రహీమ్, డా. శ్రీలత, డా. జమున, సునీత, జ్యోత్స్న తదితర అధ్యాపక బృందం మరియు విద్యార్థినులు పాల్గొన్నారు.