వెంకట్రావుపేట చెరువులో చేప పిల్లలను విడుదలచేసిన ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్
వెంకట్రావుపేట చెరువులో చేప పిల్లలను విడుదలచేసిన ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్
కోరుట్ల అక్టోబర్ 23:
కోరుట్ల నియోజకవర్గంలోని మెటుపల్లి పట్టణంలోని వెంకట్రావుపేటలోని పెద్డ చెరువులో చేప పిల్లలను ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్ విడుదల చేసారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ మాట్లాడుతూ, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు చేపలు పట్టే వృత్తిపై ఆధారపడి బతికే మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు, మత్స్యకారులు ఆర్థికంగా బలపడడానికి చేప పిల్లలు ఉచితంగా ఇవ్వడం ప్రారంభించారని అన్నారు.
కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మత్స్యకారులకు ఉచితంగా వాహనాలను అందించారని, కాళేశ్వరం నీళ్లతో చెరువులు కళకళలాడుతున్నాయని ఆయన తెలిపారు.
జూన్ నెలలో విడుదల చేయాల్సినటువంటి చేప పిల్లలను,ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక అక్టోబర్ లో విడుదల చేయాల్సి వచ్చిందని,ఇది కాంగ్రెస్ పార్టీ అసమర్థతకు నిదర్శనమని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో వారితోపాటు మున్సిపల్ చైర్మన్ రణవేణి సుజాత సత్యనారాయణ, వైస్ చైర్మన్ బోయినపల్లి చంద్రశేఖర్ రావు, మత్స్యశాఖ జిల్లా అధికారి విజయ,DCFS చైర్మన్ పల్లికొండ ప్రవీణ్,కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ సిబ్బంది, గంగపుత్ర సంఘ కుల బాంధవులు తదితరులు పాల్గొన్నారు.