గొల్లపల్లి తహసిల్దార్ కార్యాలయం ఎదుట రైతు కుటుంబం ఆందోళన

On
గొల్లపల్లి తహసిల్దార్ కార్యాలయం ఎదుట రైతు కుటుంబం ఆందోళన

తన పట్టా భూమిలో నుండి తోవ తీసే యత్నాలను నిరసిస్తూ.              గొల్లపల్లి తహసిల్దార్ కార్యాలయం ఎదుట రైతు కుటుంబం ఆందోళన

గొల్లపల్లి అక్టోబర్ 18 (ప్రజామంటలు) : 

గొల్లపల్లి మండల కేంద్రంలో, తన పట్టా భూమిలో నుంచి అక్రమంగా తోవ ఏర్పాటు యత్నాలను నిరసిస్తూ గొల్లపల్లి తహసిల్దార్ కార్యాలయం ఎదుట రైతు కుటుంబ సభ్యులతో కలిసి ఆందోళన నిర్వహించిన సంఘటన శుక్రవారం తీవ్ర కలకలం రేపింది.

తన పట్టా భూమిలో నుంచి ఎలాంటి పరిహారం ఇవ్వకుండా నేటిపారుదల రెవెన్యూ శాఖ అధికారులు బలవంతంగా తన సమ్మతి లేకుండా సర్వే చేయించి తన పట్టా భూమిని అక్రమంగా లాక్కుంటున్నారంటూ బాధిత రైతు ఆరోపిస్తున్నాడు అయితే ల్యాండ్ ఆక్వేజేషన్లో భాగంగా అందరి రైతుల పట్టా భూములతో పాటు నరేష్ అన్న రైతు భూమిని సర్వే చేసామే చేసిన తప్ప మరొకటి కాదని బాదిత రైతు ఆరోపించినట్టుగా అతని భూమిలో నుంచి ఎలాంటి తోవ ఏర్పాటు చేయడానికి కాదని తాహాసిల్దార్ వరందన్ పేర్కొన్నారు వివరాల్లోకి వెళ్తే మండలంలోని బీబిరాజు పల్లి గ్రామానికి చెందిన నులిగొప్పుల నరేష్ అనే రైతు తన భార్య, వదిన, తల్లిదండ్రులతో కలిసి కార్యాలయానికి తరలివచ్చి కార్యాలయం ఎదుట బైఠాయించి  ఆందోళన నిర్వహించారు.

IMG-20241018-WA0028

తన భూమిలో నుంచి తోవ తీయవద్దని అధికారులు తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు సంఘటన స్థలికి చేరుకున్నారు.IMG-20241018-WA0031

బాధిత రైతు నరేష్ మాట్లాడుతూ, తన పట్ట భూముల నుంచి అక్రమంగా తోవ తీయడానికి గ్రామానికి చెందిన కొందరు కుట్రలు పన్నుతున్నారని, వారికి అధికారులు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. కాలువ పరిసరాల్లో చాలామంది రైతుల పట్టా భూములు ఉన్నాయని, వారెవ్వరి భూములను సర్వే చేయకుండా, తనొక్కడివే సర్వే చేసి, తన పట్టా భూముల నుంచి తొవ తీయడానికి యత్నిస్తున్నారని ఆరోపించారు.

దీనిపై గతంలో సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ, పట్టించుకోవడమే కాకుండా, బలవంతంగా సర్వే చేయడానికి  అధికారులు వచ్చారని ఆరోపించారు. అధికారుల వైఖరికి తీవ్ర మనస్థాపం చెందే పరిస్థితి ఉందని వాపోయాడు. 

 తహసిల్దార్ వరందన్ బాధిత రైతు వద్దకు వచ్చి మాట్లాడారు.పట్టా భూముల నుంచి ఎలాంటి తోవ ఏర్పాటు చేయడం లేదని భయాందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొనడంతో ఆందోళనను విరమించారు. ఈ సందర్భంగా ఆయన వివరణ ఇస్తూ, ప్రజావసరాల కొరకు అవసరమైన చోట, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సర్వే చేశామని,అంతేకానీ పట్టా భూముల నుంచి తోవ ఏర్పాటు చేసే అధికారం తనకు లేదని పేర్కొన్నారు. నేను మండలంలో నూతనంగా బాధ్యతలు చేపట్టానని దీనిపై పూర్తి స్థాయిలో పరిశీలించి తగు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.

Tags