అడవి జంతువుల అక్రమ రవాణా ముఠా అరెస్టు

On
అడవి జంతువుల అక్రమ రవాణా ముఠా అరెస్టు

అడవి జంతువుల అక్రమ రవాణా ముఠా అరెస్టు

 మహాదేవపూర్ అక్టోబర్ 05 (ప్రజా మంటలు) :
 భూపాలపల్లి జిల్లా అటవీ రేంజ్ పరిధిలో గల మేడిపల్లి టోల్  ప్లాజా వద్ద వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో , ఇంటలిజెన్స్ సమాచారంతో పంగోలిన్ (వాలుగా) అక్రమ రవాణకు పాలు పడుతున్న  ముగ్గురు వ్యక్తులను, అధికారులు కొనుగోలుదారుల రూపంలో వచ్చి అరెస్టు చేశారు.


 తదుపరి విచారణ నిమిత్తం వారిని భూపాలపల్లి అటవీ శాఖ రేంజ్ కార్యాలయానికి తీసుకొని వచ్చి విచారించగా, వారు ఇట్టి పంగోలిన్ (వాలుగా) అక్రమ రవాణలో మరొక ఐదుగురి ప్రమేయం ఉన్న నిందితుల పేర్లు వెల్లడించారు.
ఐదుగురి కోసం గాలించగా ఇద్దరు వ్యక్తులు పట్టుబడ్డారు. మిగతా ముగ్గురు తప్పించుకొని పరారీలో ఉన్నారు. వారందరిపై వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం కేసు నమోదు చేసారు.

Tags