నంచర్ల సింగల్ విండో ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు
గొల్లపల్లి ఎప్రిల్ 23 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండలంలోని తిరుమలపురం (పిడి) గ్రామంలో నంచర్ల సింగిల్ విండో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని చైర్మన్ మంత్రి వేణు బుధవారం రోజు మధ్యాహ్నం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ రైతుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రతి ఒక్క రైతు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కష్టపడి పండించిన పంటను దళారులను నమ్మి, అమ్మి మోసపోవద్దని కోరారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయిస్తే మద్దతు ధర లభిస్తుంది అన్నారు. వరి ధాన్యం క్వింటాలుకు ఏ గ్రేడ్ రకానికి రూ.2320, బి గ్రేడ్ వరి ధాన్యానికి రూ.2300 మద్దతు ధర లభిస్తుందన్నారు. రైతులు పండించిన తమ పంటను కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి మద్దతు ధర పొందాలన్నారు.
కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల బీసీ సెల్ అధ్యక్షులు కాశ గంగాధర్ మైనార్టీ మాజీ కో అప్సన్ మెంబర్ మహమ్మద్ అలీ కస్తూరి హరి కిరణ్ గాదె అంజనేయులు నలుగొండ రాజీ రెడ్డి ఉస్కెమల్ల సత్యం పబ్బా ప్రభాకర్ లక్ష్మణ్ మస్కం ఆంజనేయులు చెవులమద్ది లచ్చయ్య చిర్ర చంద్రయ్య చిర్ర భూధవ్వ నిర్వాహకులు పబ్బా రఘు గ్రామ రైతులు, తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఉగ్రవాద పాకిస్తాన్ కు తగిన బుద్ధి చెప్పాలి.

పహల్గాం దాడికి నిరసనగా ఆటోడ్రైవర్ల నిరసన

నూతన ఆర్ఓఆర్ చట్టంపై జిల్లా కేంద్రంలో అవగాహన కార్యక్రమం పాల్గొన్న ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్

అందరికోసం న్యాయ విజ్ఞాన సదస్సులు - సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వర్ రావు

క్రీడలతో మానసిక ఉల్లాసం తో పాటు శారీరిక ధారుఢ్యం మరియు స్నేహభావం పెంపొందుతుంది . జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్

వాస్తవాలను తెలుసుకోకుండా సోషల్ మీడియా పోస్టులను ఫార్వర్డ్ చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం జగిత్యాల డీఎస్పీ రఘు చందర్

రోడ్డు ప్రమాదంలో అబ్బాపూర్ డీలర్ మృతి

ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ

ప్రతి ఉద్యోగికి పదవి విరమణ తప్పనిసరి ఎమ్మెల్యే డా.సంజయ్

మహిళా చట్టాలపై అవగాహన కల్పిస్తూ రక్షణా గా నిలుస్తున్న షి టీమ్,భరోసా సెంటర్

బిఆర్ఎస్ పార్టీ రజితోత్సవ సభకు జగిత్యాల నియోజకవర్గం సర్వం సిద్ధం

సూర్య ధన్వంతరి ఆలయము లో ఘనంగా కుంకుమ పూజలు
