విద్య ప్రాముఖ్యతను చాటి చెప్పిన మహనీయులు మహాత్మ జ్యోతిబా పూలే .... జిల్లా కలెక్టర్ శ్రీ బి. సత్య ప్రసాద్.
సిరిసిల్ల. రాజేంద్ర శర్మ
జగిత్యాల ఏప్రిల్ 11 (ప్రజా మంటలు)
జ్యోతిభా పూలె స్పూర్తి తో మెరుగైన విద్య అందించేందుకు పటిష్ట చర్యలు
చదువు తోనే జీవితంలో మార్పు సాధ్యమని విద్య మ ప్రాముఖ్యతను చాటి చెప్పిన మహనీయులు మహాత్మా జ్యోతిబా పూలే అని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ అన్నారు.
శుక్రవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశం మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ మహాత్మ జ్యోతిబా పూలే 199వ జయంతి వేడుకల్లో జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్, అదనపు కలెక్టర్ బి. ఎస్ లత మరియు కరీంనగర్ స్థానిక సంస్థల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎల్ రమణ లతో కలిసి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి, జ్యోతిబా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
*జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ మాట్లాడుతూ,* గతంలో వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థ కారణంగా దళితులు, బడుగు బలహీన వర్గాల పట్ల తీవ్ర వివక్షతకు గురయ్యేవారని అన్నారు. 1827 లో మహిళలను సమానంగా చూడటం అనే ఆలోచన కూడా చాలా కష్టమని, అటువంటి పరిస్థితుల్లో మహిళల అభ్యున్నతి కోసం కృషి చేసిన మహనీయులు పూలే అని కలెక్టర్ అన్నారు.
సామాజిక సమానత్వం సాధన కోసం జ్యోతి బా పూలే అప్పటి సమాజంలో పోరాటం చేశారని, ఆ స్ఫూర్తి మనమంతా తీసుకోవాలని, సామాజిక అసమానతలు దూరమయ్యేందుకు మన వంతు కృషి చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. బాలికల విద్యపై పూలే దంపతులు చిత్తశుద్ధితో పనిచేశారని, స్త్రీలు విద్యా వంతులు కావాలని ఆకాంక్షించారని తెలిపారు.
అట్టడుగు బడుగు బలహీన వర్గాలకు మంచి విద్య అందించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, యంగ్ ఇండియా సమీకృత విద్యాలయాల ఏర్పాటు, బీసీ స్టడీ సర్కిల్, ఎస్సి స్టడీ సర్కిల్ ద్వారా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతకు ఉచిత శిక్షణ అందించడం వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని అన్నారు.
మహనీయుల జయంతి ఉత్సవాలలో వచ్చిన వక్తలు అడిగిన వివిధ అంశాలను అధికారులు సంపూర్ణంగా వివరించాలని, మహనీయుల ఆశయాల సాధన కోసం, సమాజంలోని వివిధ వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను చివరి అర్హుల వరకు అందే విధంగా ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు చిత్తశుద్ధితో కృషి చేయాలని కలెక్టర్ సూచించారు.
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎల్ రమణ మాట్లాడుతూ ఒక రాత్రిలో అనూహ్యమైన మార్పులు రానప్పటికి ప్రభుత్వ విద్యా వ్యవస్థలో నిదానంగా స్పష్టమైన మార్పు కనిపిస్తుందని, మెరుగైన విద్యాబోధన అందించేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ అభివృద్ధి శాఖ అధికారి జి.సునీత , కలెక్టరెట్ ఏ ఓ, బీసీ సంక్షేమ సంఘం నాయకులు హరి అశోక్ కుమార్, మానల కిషన్, వివిధ ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు,ఉద్యోగులు, అన్ని వర్గాల ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
అద్దంకి వ్యాఖ్యలు అహంకారపూరితం.. కాంగ్రెస్ కాదు స్కాంగ్రెస్ పార్టీ.. బిజెపి నాయకురాలు రాజేశ్వరి.

"కొప్పుల ఈశ్వర్- 50 ఏళ్ల ప్రయాణం - ఒక ప్రస్థానం" పుస్తకావిష్కరణ

అకాల వర్షాలకు కొట్టుకపోయిన గుడిసెలు. రోడ్డు పొడవున విరిగిపడ్డ చెట్లు

బీజేపీ నేతలపై కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం

సికింద్రాబాద్ లో గుడ్ ఫ్రైడే ప్రత్యేక ప్రార్థనలు
.jpg)
మెటుపల్లి లో వాక్ఫ్ బోర్డ్ కు వ్యతిరేకంగా ముస్లింల భారీ ర్యాలీ.

విడిసి చొరవతో... రాలిన "దడువత్" డబ్బులు - ఆరేండ్ల సమస్యకు లభించిన "పరిష్కారం"

జై సూర్య ధన్వంతరి ఆధ్వర్యంలో కుంకుమ పూజలు

ఇల్లు,బడి,గుడి,ఆడవాళ్ళు ఎక్కడ గౌరవించబడితే అక్కడ స్వర్గసీమ ఉంటుంది

గొల్లపల్లి మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం..

అమర్ నాథ్ యాత్రికులకు గాంధీలో ఫిట్ నెస్ సర్టిఫికెట్లు - ఈనెల 21 నుంచి దృవపత్రాల జారీ

గాంధీ టీజీజీడీఏ జనరల్ కౌన్సిల్ మెంబర్ పోస్టులకు ఎన్నికలు
